MoviesTL రివ్యూ: చంద్ర‌ముఖి 2... సినిమా కాదు సీన్లు మాత్ర‌మే...!

TL రివ్యూ: చంద్ర‌ముఖి 2… సినిమా కాదు సీన్లు మాత్ర‌మే…!

టైటిల్‌: చంద్ర‌ముఖి 2
బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్ – శుభాస్క‌ర‌న్ స‌మ‌ర్ప‌ణ‌
నటీనటులు: రాఘ‌వ లారెన్స్‌, కంగ‌నా ర‌నౌత్‌, వ‌డివేలు, రాధిక‌, మ‌హిమా నంబియార్‌
యాక్ష‌న్‌: ర‌వివ‌ర్మ‌, క‌ణ‌ల్ క‌న్న‌న్‌, స్ట‌న్ శివ‌, ఓమ్ ప్ర‌కాష్‌
ఆర్ట్: తోట త‌ర‌ణి
ఎడిట‌ర్‌: ఆంథోనీ
సినిమాటోగ్ర‌ఫీ:
మ్యూజిక్‌: ఎంఎం.కీర‌వాణి
నిర్మాత‌: శుభాస్క‌ర‌న్‌
దర్శకుడు: పి. వాసు
రిలీజ్ డేట్‌: 28 సెప్టెంబ‌ర్‌, 2023
సెన్సార్ రిపోర్ట్‌: యూ / ఏ
ర‌న్ టైం: 172 నిమిషాలు

చంద్ర‌ముఖి 2 ప‌రిచ‌యం:
అప్పుడెప్పుడో 2005లో ర‌జ‌నీకాంత్ హీరోగా జ్యోతిక‌, న‌య‌న‌తార ప్ర‌ధాన పాత్ర‌లో వ‌చ్చిన సినిమా చంద్ర‌ముఖి. పి. వాసు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా అప్ప‌ట్లో ఓ సెన్షేష‌న్ క్రియేట్ చేసింది. ఎంతోమందిని భ‌య‌పెట్టింది. జ్యోతిక న‌ట‌న‌కు థియేట‌ర్ల‌లో జ‌నాలు ఏడ్చేశారు.. భ‌య‌ప‌డ్డారు. అంత‌లా ప్రేక్ష‌కుల మ‌దిలో చంద్ర‌ముఖి నిలిచిపోయింది. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ఆ సినిమాకు సీక్వెల్ తెర‌కెక్కింది. రాఘ‌వ లారెన్స్‌, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగ‌నా రనౌత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన ఈ సినిమాకు పి. వాసు ద‌ర్శ‌కుడు. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా ఎలా ఉందో స‌మీక్ష‌లో చూద్దాం.

TL స్టోరీ :
మదన్ ( రాఘవ లారెన్స్) ఇద్దరు పిల్లలకు గార్డియన్ గా ఉంటూ ఉంటాడు. ఆ పిల్లలతో కలిసి మదన్ వేటయ్య కోటకు రాధిక ఫ్యామిలీతో రావాల్సి వస్తోంది. ఆ తర్వాత జరిగిన పరిణామాల అనంతరం ఆ కోటలో దెయ్యంగా ఉన్న చంద్రముఖి ( కంగనా రనౌత్), రాధిక కూతురు దివ్య ( లక్ష్మీ మినల్) లోకి ప్రవేశిస్తుంది. మరోవైపు వేటయ్య అలియాస్ సింగోటయ్య ( రాఘవ లారెన్స్) ఆత్మ మదన్‌ మీదకు ఆవహిస్తుంది. ఆ తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయి ? ఇంతకీ చంద్రముఖి వేట‌య్య‌ మీద తన పగ ఎలా తీర్చుకుంది ?చివరికి దివ్య‌ని చంద్రముఖి వదిలిపెట్టిందా లేదా ఫైనల్ గా మదన్ రాధిక ఫ్యామిలీని ఎలా కాపాడాడు ? అన్న విషయాలకు సమాధానమే చంద్రముఖి 2 సినిమా

TL విశ్లేష‌ణ :
ఓవరాల్ గా చూస్తే భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్గా తీసుకొని దర్శకుడు పీ. వాసు చంద్రముఖికి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ జోనర్లో సినిమా అంటేనే కామెడీ, భయం లాంటి అంశాలతో రాసుకున్న సీన్లే ప్రధానంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. లారెన్స్ తన ఎంటర్టైన్మెంట్ తో పాటు భయాన్ని ఎమోషన్ ని కూడా బాగా పండించాడు. నటీన‌టుల‌ విషయానికి వస్తే ఈ సినిమాలో లారెన్స్ నటనే హైలెట్గా ఉంటుంది. ఇక కంగనా రనౌత్‌ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. కొన్ని హర్రర్స్ సీన్ల‌లో తన నటనతో మెప్పించింది. కీలక పాత్రలో నటించిన లక్ష్మి, రావు రమేష్ కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

తల్లి పాత్రలో నటించిన రాధిక ఎప్పటిలాగానే తనదైన శైలితో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడుగా పీ.వాసు హర్రర్ + కామెడీ కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్ల‌తో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేశాడు. దర్శకుడు పి. వాసు తెర‌కెక్కించిన కొన్ని హర్రర్, కామెడీ సీన్లు ఆకట్టుకున్నా కథనంలో ప్లో మిస్సయింది. సీన్ల ప‌రంగా బాగుంది అనిపించిన ఓవరాల్ గా కథపరంగా చూసినప్పుడు పెద్దగా ఇంపాక్ట్ కనపడదు. కథనంతో పాటు నేరేషన్లో ఇంతకుముందు వచ్చిన చంద్రముఖి పార్ట్ 1 లో ఫాలో అయిన స్క్రీన్ ప్లేనే రెండో పార్ట్ లో కూడా ఫాలో అయ్యారు. దీంతో కొన్ని సీన్లు ఇంతకుముందు చూసినవే అన్న ఫీలింగ్ కూడా ప్రేక్షకుడిలో కలుగుతుంది.

కామెడీ సీన్ల కోసమని సినిమా లెంగ్త్ పెంచేయడం సినిమాకి మరో మైనస్ పాయింట్ దీంతో సినిమా సాగదీసినట్టుగా ఉంటుంది సెకండాఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత గాని ప్రేక్షకులు అసలు కథలోకి వెళ్లడు దీనికి తోడు తమిళ నేటివిటీ సినిమాలో చాలా ఎక్కువగా ఉంటుంది వడివేలు కామెడీ కూడా ఎక్కువగా విసిగించింది సినిమాలో అనవసరమైన కామెడీ ట్రాక్స్ తీసేసి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. ఓవ‌రాల్‌గా హర్రర్ సీన్లు సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాగ్ ఎలిమెంట్స్ బాగున్నా మిగిలిన కంటెంట్ తేలిపోయినట్టుగా ఉంటుంది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే…
టెక్నికల్ గా చూస్తే దర్శకుడు పి వాసు దర్శకత్వపరంగా చూస్తే హర్రర్ కామెడీ సీన్లు బాగున్నా కొన్ని విసిగించే సీన్లు కూడా ఉన్నాయి. హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని యాక్షన్ ఎపిసోడ్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక సినిమాటోగ్రఫీ ఈ హర్రర్ కామెడీ సినిమాకి బాగా ప్లస్ అయింది. సినిమాలో గ్రాఫిక్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఎంఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ లో బాగున్న సెకండాఫ్లో మరికొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉంటే సినిమాకు ఇంకా ప్లస్ అయ్యేది. నిర్మాత సుభాస్క‌ర‌న్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా…
చంద్రముఖి 2 అంటూ వచ్చిన ఈ హర్రర్ రివేంజ్ డ్రామాలో హర్రర్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ నేపథ్యంలో ఆకట్టుకుంటుంది. లారెన్స్ – కంగనా రనౌత్ తమ నటనతో సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశారు. అయితే వర్కౌట్ కానీ కామెడీ ట్రాక్స్… రొటీన్ హ‌ర్ర‌ర్‌ ఎలిమెంట్స్, బోరింగ్ ఫ‌స్టాప్ సినిమాకు మైనస్… అంచనాలు లేకుండా వెళితే ఈ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ వరకు కనెక్ట్ అవుతాయి.

ఫైన‌ల్ పంచ్ : కొన్ని చోట్ల మెప్పించే హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌

TL రేటింగ్‌: 2 / 5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news