Newsవామ్మో.. ప్రభాస్ అసలు వయసు ఎంతో తెలుసా..? ఆధార్ కార్డ్ బయట...

వామ్మో.. ప్రభాస్ అసలు వయసు ఎంతో తెలుసా..? ఆధార్ కార్డ్ బయట పెట్టిన నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు.. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకొని ..ఇండియన్ ఫిలిం హిస్టరీ కి ఎన్నో అవార్డులను తీసుకొచ్చిన స్టార్ ప్రముఖులు ఉన్నారు . కానీ అందరిలోకి ప్రత్యేకంగా నిలిచారు రెబల్ హీరో ప్రభాస్ . పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్.. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన పేరు మారుమ్రోగిపోయేలా చేసుకున్నారు . అంతేకాదు ఆ తర్వాత నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . అయినా సరే ఆయన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో మాత్రం ఇంచు కూడా డిఫరెన్స్ రాలేదు .

ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల నుండి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ హీరో సినిమాలపరంగా టాప్ పొజిషన్లో ఉన్న.. ఇంకా బ్యాచిలర్ లైఫ్ ని కొనసాగిస్తున్నారు . దీంతో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ట్యాగ్ చేయించుకున్న ప్రభాస్ అసలు ఎందుకు ఇంత వయసు వచ్చిన పెళ్లి చేసుకోవడం లేదు అన్న ప్రశ్న అందరికీ ప్రశ్నార్ధకంగా మారింది. అయితే ప్రభాస్ వయసు ఎంత అనేది ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చాలా మంది ఆయనకు 45 ఏళ్లు దాటాయి అని ప్రచారం చేస్తునారు. కానీ ఆయన సరైన వయసు ఎవరికి తెలియదు . రీసెంట్ సోషల్ మీడియాలో ప్రభాస్ ఆధార్ కార్డు బయటపడింది . ఈ ఆధార్ కార్డులో ఉన్న డేట్ ప్రకారం ఆయన వయసు 44 గా తెలుస్తుంది. 23-10-1979లో జన్మించాడు ప్రభాస్. ఈ లెక్కను చూసుకుంటే ఆయన వయసు 43 దాటిపోతుంది. ఇంకా ప్రభాస్ ఎందుకు పెళ్లి పై ఆలోచన చేయడం లేదు అనేది అందరికీ సందేహాలు కలగజేస్తుంది. ఆది పురుష్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ ..పెళ్లి చేసుకుంటానని ..తిరుపతిలోనే పెళ్లి చేసుకుంటానని నొక్కిమరి చెప్పాడు ప్రభాస్. కాగా కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో ప్రభాస్ – హీరోయిన్ అనుష్కల మధ్య ప్రేమాయణం నడుస్తుంది అని .. త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రచారం జరుగుతూనే ఉంది.. అయితే దీనిపై ప్రభాస్ – అనుష్క ఎన్ని సార్లు స్పందించిన వీరి మధ్య ప్రేమ ఉంది పెళ్లి చేసుకుంటారు అని అంటున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి ఫ్యాన్స్ కోరిక ప్రకారమైన వీళ్లు పెళ్లి చేసుకుంటారో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news