Newsహైద‌రాబాద్‌లోనే కోట్లు కూడ‌బెట్టిన న‌య‌న‌తార‌.. ఆమె మొత్తం ఆస్తుల లెక్క‌లివే...!

హైద‌రాబాద్‌లోనే కోట్లు కూడ‌బెట్టిన న‌య‌న‌తార‌.. ఆమె మొత్తం ఆస్తుల లెక్క‌లివే…!

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా సూపర్ పాపులర్ అయ్యారు. ఇప్పటివరకు నయనతారంటే కేవలం సౌత్ ఇండియా సినిమాలకే పరిమితం. జవాన్ సినిమాతో ఆమె రేంజ్ పాన్ ఇండియాకు వెళ్లిపోయింది. ఇప్పటికే ఆమె ఒక్కో సినిమాకు ఆరు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి.

జవాన్ సినిమాతో ఇది మరింత పెరిగిపోనుంది. జవాన్ సినిమాతో నేషనల్ వైడ్‌గా కూడా నయనతార ఫాలోయింగ్ బాగా పెరుగుతూ ఉండడంతో అసలు నార్త్ ఇండియన్ జనాలు ఆమె సంపాదన గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా బయటికి వచ్చాయి. ఒక్కో సినిమాకు ఆరు కోట్ల నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నయనతార.. కేవలం 50 సెకండ్ల వాణిజ్య ప్రకటనలలో నటిస్తే ఏడు కోట్లు ఛార్జ్ చేస్తోందట.

ఆమెకు నాలుగు లగ్జ‌రీ ఇల్లు ఉన్నాయి. ముంబైలో ఒక ఇంటితో పాటు చెన్నైలో 4 బెడ్ రూమ్ల ఫ్లాట్ హైదరాబాదులో మూడు అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక ఆమెకు నెంబర్ ఆఫ్ కార్లు.. ప్రైవేట్ జెట్‌ కూడా ఉంది. ఓవరాల్ గా ఆమె ఆస్తులు విలువ రు. 300 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.

ఏది ఏమైనా వ్యక్తిగత జీవితంలో నిలదొక్కుకునేందుకు నయనతార చాలా ఇబ్బందులు పడింది. కెరీర్ పరంగా ఆమె ఎప్పుడు వెనక్కు తిరిగి తీసుకోలేదు. అయితే స్టార్ హీరోలుగా ఉన్న ప్రభుదేవా – శింబుతో ప్రేమాయణాలు విఫలం కావడం.. ఆ తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం ఇప్పుడు తన ఇద్దరు కొడుకులతో చాలా హ్యాపీగా ఉండటం విశేషం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news