News' భోళాశంక‌ర్‌ ' తో మెహ‌ర్‌ర‌మేష్ న్యాయం చేశాడు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్...

‘ భోళాశంక‌ర్‌ ‘ తో మెహ‌ర్‌ర‌మేష్ న్యాయం చేశాడు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు వెన‌క స్టోరీ ఇదే..!

ఈ టైటిల్ కాస్త వెరైటీగా ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానులు ఏంటి ? భోళాశంకర్ సినిమాతో మెహర్ రమేష్ తమ‌కు న్యాయం చేశాడని కామెంట్ చేయడం అనుకుంటున్నారా… ఎస్ ఇది నిజమే ఎన్టీఆర్ కెరీర్ పరంగా ఫామ్ లో ఉన్నప్పుడు.. మెహర్ రమేష్ దర్శకత్వంలో వరుసగా రెండు సినిమాలలో నటించాడు. చిత్రం ఏంటంటే అప్పట్లోనే మెహర్ రమేష్ ను ఏ స్టార్ హీరో కూడా దగ్గరకు రానివ్వలేదు. ప్రభాస్ తో రీమేక్‌ సినిమా బిల్లా మాత్రమే చేసాడు. ఆ సినిమా ఒక మోస్త‌రుగా ఆడిన తెలుగు హీరోలు ఎవరికీ మెహర్ రమేష్ మీద పెద్దగా నమ్మకాలు లేవు.

కానీ ఎన్టీఆర్ కంత్రి, శక్తి ఇలాంటి రెండు భారీ బడ్జెట్ సినిమాలకు అవకాశం ఇచ్చాడు. ఈ రెండు సినిమాలకు అశ్విని దత్ నిర్మాత. పైగా ఈ రెండు అరివీర‌ భయంకరమైన డిజాస్టర్లు అయ్యాయి. ఇక మగధీర సినిమా తర్వాత మెహర్ రమేష్ శక్తి సినిమా కథను పట్టుకుని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడట. బాబు మనం మగధీర రికార్డులను బద్దలు కొట్టే సినిమా చేయబోతున్నాం.. మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి అని వేడుకున్నాడట. అప్పటికే మెహర్ రమేష్ మీద ఎన్టీఆర్ కు కొన్ని సందేహాలు ఉన్నాయి.

సరే అటు అశ్వినీద‌త్‌ గారికి ఒక సినిమా చేస్తానని హామీ ఇచ్చి ఉన్నాడు. శక్తి పీఠాల మీద స్టోరీ అనగానే ఎన్టీఆర్‌కు ఎక్కడో కాస్త నమ్మకం కుదిరింది. ఆ రోజుల్లోనే భారీ బడ్జెట్ తో.. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శక్తి సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో చెప్పక్కర్లేదు. ఈ సినిమా దెబ్బతో అశ్వినీద‌త్‌ అసలు సినిమా రంగాన్ని వదిలివేయాలన్నా డిఫెన్స్ లో పడిపోయారంటే.. ఆయనను ఎంత దెబ్బ కొట్టిందో తెలుస్తోంది. ఇటు ఎన్టీఆర్ కెరీర్ లో కూడా కంత్రి ,శక్తి లాంటి రెండు పెద్ద డిజాస్టర్లు పడ్డాయి.

వాస్తవానికి మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీకి బంధువు. చిరంజీవికి వరుస‌కు త‌మ్ముడు అవుతాడు. అలాంటి మెహర్ రమేష్ ను మెగా హీరోలే దగ్గరకు రానివ్వరు. కానీ ఎన్టీఆర్ రెండుసార్లు అవకాశం ఇస్తే రెండు భయంకరమైన డిజాస్టర్లు ఇచ్చి ఎన్టీఆర్ కెరీర్ కు దెబ్బ కొట్టాడు. ఇక ఇప్పుడు తమ బంధువు అయినా మెగాస్టార్ చిరంజీవి పిలిచే అవకాశం ఇస్తే భోళా శంకర్ సినిమాతో పెద్ద రాడ్డురంబోలా లాంటి సినిమా తీసి ఆయనకు కూడా సరైన న్యాయం చేశాడని ఎన్టీఆర్ అభిమానులు ఇప్పుడు సోషల్ మీడియాలో రమేష్ ను ఒక ఆట ఆడుకుంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news