Moviesతార‌క‌ర‌త్న హీరోయిన్ ఆ సెల‌బ్రిటీకి రెండో భార్య‌గా... పెళ్లి కూడా సీక్రెట్టే...!

తార‌క‌ర‌త్న హీరోయిన్ ఆ సెల‌బ్రిటీకి రెండో భార్య‌గా… పెళ్లి కూడా సీక్రెట్టే…!

నందమూరి తారకరత్న టాలీవుడ్ లో బలమైన నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన కుర్ర హీరో. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఒకేసారి పది సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకొని చాలా గ్రాండ్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమా ఒకటో నెంబర్ కుర్రోడు ఒక మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత తారకరత్న నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేదు. హీరో నుంచి విలన్ గా కూడా మారాడు.

అమరావతి సినిమాతో మంచి ప్రశంసలు సొంతం చేసుకున్నాడు. నటనాపరంగా అద్భుతంగా ఉన్న కెరీర్ పరంగా ఎందుకో సక్సెస్ కాలేదు. తారకరత్న కెరీర్లో కలెక్షన్ల పరంగా మంచి వ‌సూళ్లు సొంతం చేసుకున్న సినిమా భద్రాద్రి రాముడు. ఈ సినిమాలో తారకరత్నకు అత్తగా సీనియర్ హీరోయిన్ వాణిశ్రీ కీలక పాత్రలో నటించారు. సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ ఈ సినిమాకు దర్శకుడు.

ఈ సినిమాలో హీరోయిన్గా ప్రముఖ కన్నడ నటి రాధిక నటించారు. రాధిక ఎవరో ? కాదు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి భార్య. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. కుమారస్వామి కన్నడలో రాజకీయ నేతగానే కాకుండా.. సినిమా రంగంలో టాప్ డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కన్నడ సినిమా రంగంతో మంచి పరిచయాలు ఉన్నాయి. రాధికతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మరి వీరిద్దరు సీక్రెట్ గా పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది.

అప్పటికే కుమారస్వామికి భార్య అనిత, కుమారులు ఉన్నారు. ఇక రాధిక తోను కలిసి ఉండటం ప్రారంభించడంతో ఈ దంపతులకు ఓ కుమార్తె జన్మించింది. కన్నడలో కొన్ని సినిమాలలో నటించిన రాధిక తెలుగులో భద్రాద్రి రాముడు సినిమాతో హీరోయిన్గా పరిచయం అయింది. ఇక తారకరత్న దురదృష్టవశాత్తు ఈ ఏడాది మృతి చెందిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news