Newsపెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన జూనియ‌ర్‌ ఎన్టీఆర్ ల‌వ‌ర్‌...!

పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన జూనియ‌ర్‌ ఎన్టీఆర్ ల‌వ‌ర్‌…!

ఎన్టీఆర్ లవర్ ఏంటి ? పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ కావడం ఏంటి అనుకుంటున్నారా ? ఇది ఆసక్తికరమైన విష‌య‌మే. ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎంతోమంది హీరోయిన్లతో నటించినా ఏ హీరోయిన్ తో రానిప్రేమ గాసిప్పులు ఒక హీరోయిన్ విషయంలో మాత్రం వచ్చాయి. ఆ హీరోయిన్ ఎవరో ? కాదు మన తెలుగు అమ్మాయి సమీరా రెడ్డి. సమీరా రెడ్డి స్వస్థలం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ మండలం ఐతంపూడి.

అయితే చిన్నప్పుడే ఆ ఫ్యామిలీ ముంబైలో సెటిల్ అవ్వడంతో సమీరా రెడ్డి కూడా ముంబైలో మోడల్గా కెరీర్ ప్రారంభించి తర్వాత హీరోయిన్ అయింది. ఆమె ఎన్టీఆర్ కి జోడిగా నరసింహుడు – అశోక్ సినిమాలలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. ఇదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అని.. ఎన్టీఆర్ కూడా సమీరారెడ్డిని ఇష్టపడ్డాడు అని అంటారు. ఆ తర్వాత సమీరా బాలీవుడ్ కి వెళ్ళిపోయి అక్కడ కొన్ని సినిమాలలో హీరోయిన్గా నటించి సక్సెస్ అయింది.

స‌మీరా త‌న తాజా ఇంట‌ర్వ్యూలో కొన్ని సంచ‌ల‌న విష‌యాలు చెప్పింది. త‌న పెళ్లి విషయంలో కొందరు చేసిన విమర్శలు తనకు చాలా బాధను కలిగించాయని… 2014లో అక్షయ్‌తో నా పెళ్లి జరిగింది.. మా ఇంటి టెర్రస్‌పైనే మేం పెళ్లి సింపుల్‌గా చేసుకున్నామ‌ని తెలిపింది. అయితే పెళ్లికి ముందే తాను ప్రెగ్నెంట్ అయ్యాన‌ని కొంద‌రు చేసిన కామెంట్ల‌లో నిజం లేద‌ని.. పెద్దల అంగీకారంతోనే మా వివాహం జరిగింద‌ని.. ప్రెగ్నెన్నీ టైంలో మాత్రం తాను ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొన్న‌ట్టు స‌మీరా తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news