Moviesవిడాకుల తరువాత నీహారిక ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం అతడేనా..?...

విడాకుల తరువాత నీహారిక ఈ రేంజ్ లో రెచ్చిపోవడానికి కారణం అతడేనా..? ఆ అండ చూసుకునే ఇలా తయారైందా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో .. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మెగా డాటర్ నిహారిక కు సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంతేకాదు నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ఆమెపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు జనాలు . ఆమె ఎక్కడికి వెళ్తుంది .. ఏం చేస్తుంది.. ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటుంది .. ఎలాంటి ఫోటోషూట్స్ చేస్తుంది. ఎలాంటి మనుషులతో ఫ్రెండ్షిప్ చేస్తుంది.. అనేదానిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

అయితే నీహారిక మాత్రం సోషల్ మీడియాలో ఎలాంటి వార్తలు వైరల్ అయినా పట్టించుకోవడం లేదు తన లైఫ్ తనది అంటూ లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్ గా ఎల్లో కలర్ లాంగ్ స్లిట్టేడ్ ఫ్రాక్ లో నిహారిక బోల్డ్ ఫోటోషూట్ చేసింది . ఈ ఫొటోస్ లో కిల్లింగ్ లుక్స్ లో నిహారిక చంపేసింది . అయితే ఓ పక్క సోషల్ మీడియాలో ఇంతటి ఇంతటి ట్రోలింగ్ జరుగుతున్నా సరే నిహారిక ఎందుకు ఇలాంటి ఫోటోషూట్స్ చేస్తుంది ..? అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి.

అయితే నిహారిక వెనక మెగా హీరో వరుణ్ తేజ్ ఉన్నాడని.. తన నాన్నని ఎదిరించి సైతం నిహారికకు సపోర్ట్ చేస్తున్నారు అని .. అందుకే నిహారిక ఆయన అండ చూసుకొని ఇలా రెచ్చిపోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . దీనితో సోషల్ మీడియాలో నిహారిక ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news