Moviesసామ్ - చైతులా ఆ సినిమా స్టార్ క‌పుల్స్ కూడా విడాకులు…...

సామ్ – చైతులా ఆ సినిమా స్టార్ క‌పుల్స్ కూడా విడాకులు… వేణుస్వామి మ‌రో సంచ‌ల‌నం..!

వేణుస్వామి త‌ర‌చూ సినిమా, రాజ‌కీయ నాయ‌కుల జాత‌కాలు చెపుతూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తూ ఉంటారు. ప్ర‌ముఖ జ్యోతిష్యుడు. ఆయ‌న ముందుగా స‌మంత – నాగ‌చైత‌న్య పెళ్లి చేసుకోక ముందే వీరిద్ద‌రు విడిపోతార‌ని ఆయ‌న సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. చాలా మంది అప్ప‌ట్లో వేణుస్వామిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

అయితే చివ‌ర‌కు వేణుస్వామి చెప్పిందే నిజం అయ్యింది. స‌మంత – చైతు నాలుగేళ్ల పాటు కాపురం చేసి విడిపోయారు. ఆ త‌ర్వాత వేణుస్వామి చెప్పిన చాలా విష‌యాలు నిజం అయ్యాయి. టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ హీరో చ‌నిపోతాడ‌ని చెప్ప‌డంతో ఎవ్వ‌రూ న‌మ్మ‌లేదు. చివ‌ర‌కు తార‌క‌ర‌త్న అనూహ్యంగా గుండెపోటుతో మృతిచెందారు

ఇక సామ్ – చైతులా మ‌రో హీరో, హీరోయిన్ విడిపోతార‌ని చెప్ప‌గా… అలాగే ఐశ్వ‌ర్య – ధ‌నుష్ కూడా అలాగే విడిపోయారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మ‌రో హీరో – హీరోయిన్ విడిపోతార‌ని వేణుస్వామి మ‌రో షాకింగ్ న్యూస్ పేల్చారు. ఆది పినిశెట్టి – నిక్కీ గ‌ల్రానీ కూడా విడిపోతార‌ని చెప్పారు.

వీరిద్ద‌రి జాత‌కం క్షుణ్ణంగా ప‌రిశీలిస్తే వీరిద్ద‌రు విడిపోయేందుకు 80 శాతం అవ‌కాశాలు ఉన్నాయ‌ని.. వీరు క‌లిసి ఉండ‌డం అసాధార‌ణం అని చెప్పారు. ప్ర‌స్తుతం వేణుస్వామి వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news