Moviesశ్రీలీల అభిమానులకు గుండె పగిలే న్యూస్ ఇది.. ఎలా తట్టుకుంటారో ఏమో..!

శ్రీలీల అభిమానులకు గుండె పగిలే న్యూస్ ఇది.. ఎలా తట్టుకుంటారో ఏమో..!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగెస్ట్ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీ లీల హవా ఎలా కొనసాగుతుందో మనకు తెలిసిందే . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ హీరో దగ్గర నుంచి నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరో వరకు అందరూ శ్రీలీల జపమే చేస్తున్నారు . ఆమె తమ సినిమాలో హీరోయిన్ గా ఉండాలి అని భావిస్తున్నారు ..దానికి కారణం ఆమె అందం ఒక రీజన్ అయితే.. ఆమె ఎవరు పక్కనైనా సరే ఇట్టే సూట్ అవుతూ ఉండడం మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి .

కాగా శ్రీలీల అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీలీల ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి తెలిసిందే. ప్రెసెంట్ ఆఖరి సంవత్సరం చదువుతుంది . కాగా ఈ ఆఖరి సంవత్సరం పరీక్షలు కారణంగా శ్రీ లీల మూడు నెలల పాటు సినిమాలకు బ్రేక్ చెప్పబోతుందట . నవంబర్ – డిసెంబర్ – జనవరిలో ఆమెకు పరీక్షలు ఉన్న కారణంగా బుద్ధిగా చదువుకోవాలని ఆ మూడు నెలలు కాల్ షీట్స్ మొత్తం క్యాన్సిల్ చేసేసిందట.

అంతేకాదు కమిట్ అయిన ప్రాజెక్ట్స్ ని కూడా మూడు నెలలు హోల్డ్ లో పెట్టాలి అని సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన సినిమాలను మాత్రం త్వర త్వరగా కంప్లీట్ చేసేస్తుందట . దీంతో మూడు నెలలపాటు శ్రీలీలను తెర పై చూడలేము అంటూ ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news