Movies"పచ్చి నిజాన్ని బయటపెట్టేసిన తమన్నా"..ఇంత బోల్డ్ గా మాట్లాడేసింది ఏంటి రా...

“పచ్చి నిజాన్ని బయటపెట్టేసిన తమన్నా”..ఇంత బోల్డ్ గా మాట్లాడేసింది ఏంటి రా బాబు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నాకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తమన్నా నటించిన వెబ్ సిరీస్ లో అన్ని సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి . అయితే తమన్నా తన 18 ఏళ్ల కెరియర్ లో ఎప్పుడు హద్దులు మీరి నటించింది లేదు . కాస్త ఎక్స్పోజింగ్ చేసింది కానీ ..ఎక్కడ అమ్మడు జనాలు చీ కొట్టేంత నటన చూపించలేదు .

కానీ కెరియర్ లోనే ఫస్ట్ టైం జీ కర్దా వెబ్ సిరీస్ లో టాప్ తీసేసి శృంగార సన్నివేశాల్లో పాల్గొంది . అంతేకాదు బ్యాక్ టు బ్యాక్ వచ్చిన లస్ట్ స్టోరీస్ లో కూడా అమ్మడు హాట్ గా కనిపించింది . దీంతో సోషల్ మీడియాలో తమన్నా ఫ్యాన్స్ బూతు కామెంట్స్ చేశారు . ఇన్నాళ్లు పద్ధతిగా ఉన్న తమన్నా.. ఇప్పుడు ఎందుకు ఇలా తయారయింది అంటూ హాట్ హాట్ గా మాట్లాడారు .

అయితే వీటన్నిటికీ క్లారిటీ ఇస్తూ తమన్న రీసెంట్ ఇంటర్వ్యూలో వాళ్లకు ధీటైన సమాధానం ఇచ్చేసింది . “నిజానికి ఓ నటి అన్నాక ఇండస్ట్రీలో అన్ని విధాలుగా తనలోని టాలెంట్ ని చూపించాలి .. కేవలం అలాంటి పాత్రలే చేస్తాను ఇలానే ఉంటాను అంటూ గిరి గీసుకుంటే ఆమె నటి అయిపోదు.. ఈ విషయం నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను ..అందుకే అలాంటి సీన్స్లో చేశాను . అయినా అది నేను ఊరికే ఏం చేయలేదు.. కథ ప్రకారం కాన్సెప్ట్ ప్రకారం అది ముఖ్యం అందుకే అలాంటి సీన్స్ లో నటించాను .. ఓ హీరోయిన్ అలాంటి సీన్స్ లో నటించిన మాత్రాన తప్పుడు మనిషి అయిపోదు.. ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారో తెలియడం లేదు “అంటూ ఘాటుగానే స్పందించింది తమన్నా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news