Moviesఆ విషయంలో మోసపోయిన మహేశ్ బాబు..అల్లు అర్జున్ ఇలాంటి పనులు కూడా...

ఆ విషయంలో మోసపోయిన మహేశ్ బాబు..అల్లు అర్జున్ ఇలాంటి పనులు కూడా చేసాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ కెరీర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా జులాయి. ఇంకా పక్కాగా చెప్పాలంటే ఈ సినిమా తర్వాతనే అల్లు అర్జున్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది . అప్పటివరకు అల్లు హీరోగా .. మెగా హీరోగా ట్యాగ్ చేయించుకున్న అల్లు అర్జున్ ..జులాయి సినిమాతో సొంత టాలెంట్ గల హీరోగా పేరు సంపాదించుకున్నాడు .

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను క్లీన్ స్వీప్ చేసింది . అప్పట్లోనే 45 కోట్లు వసూలు చేసే సినిమా ఇండస్ట్రీని దడదడలాడించింది . యూఎస్ లో ఒక మిలియన్ డాలర్లకు పైగా రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఇంత మంచి కథను త్రివిక్రమ్ ముందుగా అనుకున్న హీరో మహేష్ బాబు అంటూ తెలుస్తుంది .

అప్పటికే ఖలేజా సినిమాతో బిగ్ డిజాస్టర్ అందుకున్న మహేష్ బాబు కి త్రివిక్రమ్ డైరెక్షన్లో సినిమా అంటేనే వణికిపోయాడట . అందుకే కథ నచ్చిన కాని ధైర్యం చేయలేక.. ఈ సినిమా రిజెక్ట్ చేశారట . అయితే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా అల్లు అర్జున్ వద్దకు ఈ కథ తీసుకొని వెళ్లగా ఆయన ఓకే చేయడం విశేషం. అప్పటికి త్రివిక్రమ్ చెప్పాడట..”ఈ కధ మహేశ్ కోసం రాసుకున్నాను.. ఆయన రిజెక్ట్ చేసాడు అని..” కానీ అల్లు అర్జున్ ఒప్పుకుని సినిమా చేశాడట. ఆ తరువాత టకటక షూటింగ్ కంప్లీట్ అయి ..టక టక రిలీజ్ చేయడం.. అంతే రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టడం చకచకా జరిగిపోయాయి . దీంతో మంచి సినిమాను మిస్ చేసుకున్నట్లయ్యింది మహేష్ బాబు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news