Moviesబోయపాటి-రామ్ మూవీ టైటిల్ వచ్చేసిందోచ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న మాస్...

బోయపాటి-రామ్ మూవీ టైటిల్ వచ్చేసిందోచ్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న మాస్ గ్లింప్స్..ఇరగదీసేసాడు పో(వీడియో)..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రాం పోతినేని జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. హిట్లు ఫ్లాప్ లు అంటూ ఈ సంబంధం లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతూ క్రేజీ క్రేజీ అప్డేట్స్ ఇచేస్తున్న రామ్ పోతినేని తాజాగా తన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన టైటిల్ ని రివిల్ చేశారు. మనకు తెలిసిందే రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు .

ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఫుల్ భారీ అంచనాలు పెంచేసింది. కాగ కొద్ది సేపటి క్రితం ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని రివీల్ చేశారు బోయపాటి శ్రీను. రామ్ పోతినేని సినిమాకి “స్కంద” అనే టైటిల్ ఫిక్స్ చేశారు . మొత్తానికి టైటిల్ చాలా పవర్ ఫుల్ గానే ఫిక్స్ చేశాడు బోయపాటి శ్రీను .

అంతే కాదు ఈ సినిమాలో రామ్ పోతినేని ఫుల్ టు ఫుల్ మాస్ లుక్స్ లో కనిపించబోతున్నాడు అంటూ తెలుస్తుంది. గ్లింప్స్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్ధమైపోతుంది. ఈ మాస్ గ్లింప్స్ లో రామ్ చెప్పిన డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది “మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేది ఉండదు” డైలాగ్ చాలా మాస్ గా ఉండటంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. రామ్ మాస్ అవతార్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు. . దీనితో సోషల్ మీడియాలో రామ్ పోతినేని బోయపాటి శ్రీనివాస్ -రామ్ “స్కంద” సినిమా టైటిల్ వైరల్ గా మారింది . స్కంద సినిమా అయిపోగానే మరోసారి బాలయ్య తో సినిమాను తెరకెక్కించబోతున్నాడు బోయపాటి శ్రీను..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news