Movies"యస్..బాలయ్య గురించి వైరల్ అవుతున్న వార్త నిజమే".. ‘భగవంత్ కేసరి’ నుండి...

“యస్..బాలయ్య గురించి వైరల్ అవుతున్న వార్త నిజమే”.. ‘భగవంత్ కేసరి’ నుండి పూనకాళ్లు అప్డేట్ వచ్చేసిందిరోయ్..!!

టాలీవుడ్ నట్సింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ చేస్తున్న మూవీ “భగవంత్ కేసరి”. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ కంప్లీట్ అయిపోయాయి. ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల ముద్దుగుమ్మ టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే బాలయ్య కూతురు పాత్రలో లేటెస్ట్ యంగ్ సెన్సేషన్ శ్రీ లీల కనిపించబోతుంది .

ఇప్పటికే వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి . కాగా భగవంత్ కేసరి సినిమాకు సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సోషల్ మీడియాలో ఫాన్స్ హంగామా చేస్తున్నారు . అలాంటిది బాలయ్యకు సంబంధించిన న్యూస్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది చిత్రం బృందం . ప్రజెంట్ బాలయ్య నటిస్తున్న భగవంత కేసరి సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీ లో ఏర్పాటు చేసినట్లు ఓ న్యూస్ ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

అంతేకాదు ఈ సాంగ్లో యంగ్ బ్యూటీ శ్రీ లీల – కాజల్ అగర్వాల్ తో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా కనిపించబోతుందని .. అది స్పెషల్ సర్ప్రైజ్ అని ..అది థియేటర్లో తెర పైనే చూడాలి అంటూ సరికొత్త ట్విస్ట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. అంతేకాదు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాలయ్య ఫ్లోర్ మూమెంట్ వేయబోతున్నాడు అని ప్రచారం జరిగింది. ఆ స్టేప్ ఈ పాటలోనే అంటూ తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పాట షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ వేసి మరి తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది . ఈ పాట సినిమాకే హైలెట్గా నిలవబోతుందట . దీంతో నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని తెగ ట్రెండ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక్క స్టెప్ తో బాలయ్య బాక్స్ ఆఫీస్ రికార్డులు షేక్ చేయబోతున్నాడు అంటూ అభిమానులు ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news