Moviesఉపాసన-చరణ్ ల పాప పేరు ఇదే.. ఎంత పవిత్రంగా పెట్టారో..హ్యాట్సాఫ్ మెగా...

ఉపాసన-చరణ్ ల పాప పేరు ఇదే.. ఎంత పవిత్రంగా పెట్టారో..హ్యాట్సాఫ్ మెగా ఫ్యామిలీ..!!

కొట్లాదిమంది మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ రానే వచ్చేసింది. మెగా ప్రిన్సెస్ రాం చరణ్ – ఉపాసన కూతురు పేరుని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి . కాగా జూన్ 20వ తేదీ మంగళవారం ఉదయం తెల్లవారుజామున ఒంటిగంట 49 నిమిషాలకు పండు లాంటి పాపకు జన్మనిచ్చింది ఉపాసన. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఉపాసన పాప కి ఏం పేరు పెట్టబోతున్నారా..? అంటూ తెగ చర్చలు నడిచాయి.

ఫైనల్లీ ఉపాసన – రాంచరణ్ తన పాపకు ఎంతో పవిత్రమైన పేరును పట్టుకొచ్చారు. లలితా సహస్రనామం నుంచి తీసుకున్న ఓ పేరుని ఉపాసన కూతురికి పట్టుకొచ్చారు మెగా ఫ్యామిలీ. “‘క్లీంకార కొణిదెల” అని నామకరణం చేశారు . ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి . ఇవాళ చరణ్ పాపకు బారసాల చేసిన విషయం తెలిసిందే . దీనికి సంబంధించిన పిక్స్ ని కూడా రిలీజ్ చేసింది మెగా ఫ్యామిలీ .

ఈ క్రమంలోనే తాతయ్య నానమ్మ చిరంజీవి – సురేఖ దంపతులు పేరును చిన్నారి చెవిలో మూడు సార్లు చెప్పారు . ఈ క్రమంలోనే ఉపాసన రాంచరణ్ లు పాప పేరు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియా వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ..ఈ పేరు చాలా పవిత్రమైనది..అమ్మవారి పేరుగా భావిస్తారు.. చాలా శక్తి..ధైర్యం…శాంతి గల అమ్మాయిగా పాప ఉండాలని ఈ పేరుని చూస్ చేసుకున్నారట మెగా కుటుంబం. మొత్తానికి పాప పేరు చాలా వెరైటీ గా ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news