Moviesవినకూడని మాట విన్న మెగా కోడలు పిల్ల.. కోపంతో ఒక్కోక్కడికి ఇచ్చిపడేసిందిగా..!!

వినకూడని మాట విన్న మెగా కోడలు పిల్ల.. కోపంతో ఒక్కోక్కడికి ఇచ్చిపడేసిందిగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్లు చిత్రీకరించే టాలెంటెడ్ పర్సన్స్ ఎక్కువైపోయారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ పై ఎలాంటి గాసిప్స్ వినిపిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తాజాగా అదే లిస్టులోకి ఆడ్ అయిపోయింది అందాల ముద్దుగుమ్మ కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి . టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ ని ప్రేమించి ఘనంగా నిశతార్థం చేసుకున్న ఈ బ్యూటీ త్వరలోనే మెగా ఇంటికి కోడలుగా అడుగు పెట్టబోతుంది.

మెగా ఇంటికి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి పై మీడియా ఫోకస్ ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ప్రతి వార్త హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠికి భయంకరమైన జబ్బు ఉందని.. ఏదైనా కొత్త వస్తువులను చూస్తే వణికి పోతుందని.. షివరింగ్ వచ్చేస్తుందని ..కళ్ళు తిరిగి పడిపోతుంది అని ..నానా రకాలుగా ట్రోల్ చేశారు .

ఈ క్రమంలోనే ఆ వార్తలు అటు ఇటు చేరి ఆఖరికి లావణ్య చెవిన పడ్డాయి . దీంతో ఒక్కసారిగా రఫాడించేసింది . మెగా కోడలు పిల్ల కోపంతో ఊగిపోయింది . “నాకు జబ్బుందా..? నాకు తెలియకుండా నాకే జబ్బు ఉందన్న సంగతి మీకు ఎవరు చెప్పారు..? సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు ఎలా ప్రచారం చేస్తారు..? నాకు జబ్బు ఉందని క్రియేట్ చేస్తే మీకు ఏమొస్తుంది ..? ఏం లాభం..? దయచేసి ఇలాంటి చెత్త వార్తలు రాయకండి ..? ఉన్నది ఉన్నట్లు రాయండి. నాకు ఎలాంటి జబ్బు లేదు. నాకు తెలిసినంతవరకు నేను పర్ఫెక్ట్ ఆరోగ్యకరంగా ఉన్నాను ” అంటూ ఎవరైతే ఆమెపై నెగటివ్ కామెంట్స్ చేశారో.. నెగటివ్ ట్రోలింగ్కి గురి చేశారో వాళ్ళకి ఇచ్చి పడేసింది మెగా కోడలు లావణ్య త్రిపాఠి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news