Movies' అరుంధతి ' సినిమాకు సోనూసూద్ రెమ్యున‌రేష‌న్ వెనుక అంత స్టోరీ...

‘ అరుంధతి ‘ సినిమాకు సోనూసూద్ రెమ్యున‌రేష‌న్ వెనుక అంత స్టోరీ ఉందా..!

టాలీవుడ్ సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో, స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధానపాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఈ సినిమాలోని పాత్రలను ప్రేక్షకులు అంత త్వరగా మర్చిపోలేరు. ఈ సినిమా అనుష్క కెరీర్ లో ఓ మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమాతో ఈమె లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. సీనియర్ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా అసలు అంచనాలు ఏమీ లేకుండా 2009 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎవరు ?ఊహించని విజయం అందుకుంది.

ఈ సినిమాలో అరుంధతి క్యారెక్టర్ ఎంత త్వరగా ప్రేక్షకులకు ఎక్కిందో ? అదే రీతిలో తర్వాత బాగా దగ్గరైన‌ రోల్ పశుపతి. ఈ క్యారెక్టర్ లో సోనూసూద్ నటించాడు. క్రూరమైన విలన్ పాత్రలో సోనూసూద్ అదరగొట్టేసాడు. ఇదే సమయంలో ఈ సినిమాకు సోనూసూద్ తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుంది. ముందుగా సోనూసూద్‌ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు. కానీ నిర్మాత శ్యామ్‌ ప్రసాద్ రెడ్డి పడిన తపన చూశాక సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడట.

అదే సమయంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సోనూసూద్‌ను 20 రోజులు కాల్ షీట్స్ అడిగితే.. సోనుసూద్ అన్ని రోజులకు కలిపి రూ.18 లక్షలు రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేశారట. అదే సమయంలో ఒకవేళ రూ.20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా చేస్తానని ఆయన మరో ఆఫర్ కూడా ఇచ్చారట. నిర్మాత శ్యామ్‌ ప్రసాద్ రెడ్డి మాత్రం కేవలం 20 రోజులకే కాల్ షీట్లు తీసుకుని సోనూసూద్‌కు రూ.18 లక్షలు రెమ్యూనరేషన్ కన్ఫర్మ్ చేశారట.

అదే సమయంలో 20 రోజుల్లో వర్క్ పూర్తి కాకపోతే.. ఆ తర్వాత షూటింగ్లో పాల్గొనే ప్రతిరోజు సోనూసూద్‌కు రూ.25000 ఇస్తానని నిర్మాత మాట ఇచ్చారట. ఇక సినిమా షూటింగ్ మొదలుపెట్టాక సోనూసూద్ పాత్రకు సంబంధించి షూటింగ్ 20 రోజుల్లో పూర్తికాలేదు. ఇలా అరుంధతి సినిమా ద్వారా సోనూసూద్‌కు వచ్చిన రెమ్యున‌రేష‌న్ అక్షరాల రూ.45 లక్షలని తెలుస్తుంది. ఇలా రెండు లక్షలు ఇచ్చేందుకు వెన‌కాడిన శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ఫైనల్ గా మరో రూ.27 లక్షలు అదనంగా అతడికి ఇవ్వాల్సి వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news