Movies21 ఏళ్ల తరువాత అలాంటి పని చేయబోతున్న నాగార్జున.. పెద్ద సాహసమే...

21 ఏళ్ల తరువాత అలాంటి పని చేయబోతున్న నాగార్జున.. పెద్ద సాహసమే చేస్తున్నాడే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో అక్కినేని నాగార్జున గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తున్న నాగార్జున కొడుకుల విషయంలో మాత్రం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అన్న కామెంట్లు ఇప్పటికీ వినిపిస్తున్నాయి . కాగా నాగార్జున లాస్ట్ గా నటించిన సినిమా ఘోస్ట్ . ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . అభిమానులను ఆకట్టుకోలేకపోయింది .

ఈ క్రమంలోనే నాగార్జున రూట్ మార్చి సినిమాలు తీయాలని డిసైడ్ అయ్యాడట . ఈ క్రమంలోనే గతంలో ఆయన సినిమాల్లో హిట్గా నిలిచిన మన్మధుడు- గీతాంజలి లాంటి సినిమా టైప్లో ఉండే స్టోరీస్ చూస్ చేసుకోవాలని భావిస్తున్నారట . ఇదే క్రమంలో కొంచెం రొమాన్స్ పెంచుతూ నాగార్జున ఆర్ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఓ సినిమాకి ఫిక్స్ అయ్యాడట.

కాగా ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి హిట్ కొట్టిందే లేదు . రీసెంట్ గానే మంగళవారం అనే పోస్టర్ రిలీజ్ చేసి సైలెంట్ అయిపోయారు . కాగా ఇలాంటి సినిమా డైరెక్టర్ తో మన్మధుడు లాంటి సినిమా అనగానే జనాలు షాక్ అయిపోతున్నారు . అంతే కాదు ఆయన ఎప్పుడో 2002లో నటించిన మన్మధుడు సినిమా టైప్ స్టోరీ కోసం నేటి కాలం డైరెక్టర్ ని చూస్ చేసుకోవడం బిగ్ మిస్టేక్ అంటున్నారు. దీంతో దాదాపు సినిమా రిలీజ్ అయిన 21 ఏళ్ల తర్వాత మళ్లీ నాగర్జున అలాంటి రోల్ కోసం ట్రై చేస్తున్నాడా ..? అనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news