Moviesబాలయ్య అందుకే తన కూతుర్లని హీరోయిన్స్ చేయలేదా..? నిజంగానే దేవుడివి సామీ..!!

బాలయ్య అందుకే తన కూతుర్లని హీరోయిన్స్ చేయలేదా..? నిజంగానే దేవుడివి సామీ..!!

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ సర్వసాధారణం . తాతల పేర్లు తండ్రిల పేర్లు చెప్పుకొని ఎంతోమంది ముద్దుగుమ్మలు హీరోయిన్లు హీరోలు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు . అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా తన తండ్రి రాజ్యమేలేస్తున్న సరే తన ఇద్దరు కూతుర్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రాలేకపోయారు . కారణమేదైనా కావచ్చు తీసుకున్న నిర్ణయం మంచిది అంటున్నారు అభిమానులు . ఇప్పటికే అర్థమయిపోయిందిగా ఆ హీరో ఎవరు? నందమూరి బాలకృష్ణ .

నందమూరి తారకరామారావు గారి కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ .. తనదైన స్టైల్ లో దూసుకుపోతున్నాడు . ఇండస్ట్రీలో మకుటం లేని మహారాజుగా ఏలేస్తున్నాడు . కాగా ఆయనకు ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు . అయితే కూతుర్లని ఏనాడు ఇండస్ట్రీలో తెరపై చూపించలేదు . దానికి రీజన్ వాళ్లకు ఇంట్రెస్ట్ లేకపోవడం . మొదటినుంచి బ్రాహ్మిణికి – తేజస్వినికి సినిమాలపై పెద్ద ఇంట్రెస్ట్ లేదట .

ముఖానికి రంగులు పూసుకొని నటించడం పై ఆసక్తి లేదట . ఏదైనా సరే వెనక తమకంటూ స్పెషల్ గుర్తింపు సంపాదించుకునేలానే ట్రై చేశారట . అంతేకాదు నారా బ్రాహ్మణి ఇప్పుడు హెరిటేజ్ సంస్థలను సింగిల్ హ్యాండ్ తో రన్ చేస్తుంది. తేజస్విని సైతం నాన్న సినిమాలకు సంబంధించిన టెక్నికల్ వర్క్ ని చూసుకుంటుంది . కాగ త్వరలోనే నందమూరి వారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . దీంతో బాలయ్య పేరు మరోసారి వైరల్ గా మారింది . మొత్తానికి ఇండస్ట్రీలోకి కూతురుని హీరోయిన్గా దించకుండా బాలయ్య మంచి పనే చేశారు. నేటి కాలం హీరోయిన్స్ ఎలా తగలడారో మనకు తెలిసిందే కదా..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news