News"నువ్వు ఓ పెద్ద చీటర్".. సుకుమార్ ని తీవ్రంగా హర్ట్ చేసిన...

“నువ్వు ఓ పెద్ద చీటర్”.. సుకుమార్ ని తీవ్రంగా హర్ట్ చేసిన స్టార్ హీరోయిన్..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు సంపాదించుకున్న సుకుమార్ త్వరలోనే పుష్ప 2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో తన పేరును మారుమ్రోగిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నారు . రీసెంట్గా రిలీజ్ అయిన పుష్ప టీజర్ ఏ రేంజ్ లో ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇలాంటి క్రమంలోనే సుకుమార్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

సుకుమార్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ హిట్గా నిలిచిన సినిమా” ఆర్య”. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించాడు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటృఈ ఇచ్చింది అను మెహత. మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించుకున్నా.. మిగతా సినిమాలు హిట్ అవ్వకపోవడంతో తర్వాత సినీ ఇండస్ట్రీని వదిలేసింది. ఆర్య సినిమాతో ఇండస్ట్రీని ఏలేస్తుంది అన్న కామెంట్లు ఎక్కువగా వినిపించాయి .

అయితే అను ఈ సినిమా తర్వాత హిట్ కొట్టిందే లేదు . అడపాదడపా సినిమాలు చేసిన ఎక్కడ అమ్మడు క్రేజ్ దక్కించుకునే స్థాయికి ఎదగలేదు . ఈ క్రమంలోనే సినిమా ఓకే చేసేటప్పుడు సుకుమార్ ఆమెకు చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కొన్నాళ్ల తర్వాత సుకుమార్ పి మండిపడిందట . “నువ్వు ఈ సినిమా చేస్తే నా జీవితం మారిపోతుంది ..నా కెరియర్ టర్న్ అయిపోతుంది ..అంటూ చెప్పావు కానీ అలాంటిది ఏదీ జరగలేదు ..ఆర్య తప్పిస్తే మిగతా ఏ సినిమా హిట్ అవ్వలేదు. నన్ను హీరోయిన్గా గుర్తించలేదు.”..అంటూ అను – సుకుమార్ పై రెచ్చిపోయి మరి టంగ్ స్లిప్ అయిందట .

నువ్వు చీటర్ వి .. నీ సినిమాలో హీరోయిన్స్ ఓకే చేయడం కోసం అలాంటి మాటలు చెప్పి చీట్ చేస్తావు అంటూ ఆమె చాలా బాధపడిపోయిందట . అయితే ఆమె బాధను అర్థం చేసుకున్న సుకుమార్ ఏమాత్రం ఆమెను పల్లెతి మాట కూడా అనలేదట. కానీ ఆమె మాట్లాడిన మాటలకు చాలా హార్ట్ అయ్యాడట . హిట్ ఇచ్చిన డైరెక్టర్ నన్ను ఇన్ని మాటలు అంటుందా..? అంటూ చాలా హర్ట్ అయ్యాడట . అయితే ఆ తర్వాత సుకుమార్ ఇలాంటివి కామన్ అంటూ లైట్ గా తీసుకొని కెరియర్ ముందుకు తీసుకెళ్లాడట . ప్రజెంట్ సుకుమార్ పుష్ప2 సినిమాలో బిజీ బిజీగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news