Moviesఅభిమానుల మనసు గెలిచిన ఎన్టీఆర్.. పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ కోసం ఏం...

అభిమానుల మనసు గెలిచిన ఎన్టీఆర్.. పుట్టినరోజు నాడు ఫ్యాన్స్ కోసం ఏం చేసాడో చూడండి..గ్రేట్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు . ఈ క్రమంలోని ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ ఆయనకు స్పెషల్గా విష్ చేశారు . ఎంతో మంది అభిమానులు ఎంతోమంది జనాలు ఆయన ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు.. అంతేకాదు ఇలాంటి హార్ట్ ఫెల్ట్ విషెస్ పై ఎన్టీఆర్ సుదీర్ఘంగా ఓ లేఖను రిలీజ్ చేశారు . ఆ లేఖలో ఆయన తన ఫ్యాన్స్ గురించి చెప్పుకొచ్చారు.

ఆయన ఆ లేఖలో..” ఇలాంటి మీ అభిమానం అందుకోవడం నిజంగా నా అదృష్టం .. నా కెరియర్ ముందు నుంచి మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తూ వచ్చారు.. నా హిట్లల్లో ..నా ఫ్లాప్ లలో ప్రతి విషయంలో తోడు ఉన్నారు. నేను హిట్టు కొట్టిన ప్రతి సినిమాకి కారణం మీరే .. ఈ పుట్టినరోజు నాకు ఎంతో స్పెషల్ “దేవర” సినిమా టైటిల్ ని కూడా మీరు యాక్సెప్ట్ చేశారు . ఈ పుట్టిన రోజు నా లైఫ్ లో మర్చిపోలేనిది ..మీ అభిమానాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను.. మీ రుణం నేను తీర్చుకోలేనిది ..ఎప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను . ప్రతి ఒక్క అభిమానికి పేరుపేరునా నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు థాంక్స్ “అంటూ చెప్పుకొచ్చాడు .

ఈ క్రమంలోనే తారక్ పోస్ట్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్ . ఏ మాటకు ఆ మాటే నందమూరి హీరో మాత్రమే ఇలా చేస్తున్నాడు . ఇలా చేయగలడు ..మిగతా హీరోలు ఆ రోజు వరకే పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకొని పక్కకు వదిలేస్తారు. కానీ తారక్ ప్రతి సంవత్సరం తనకు పుట్టినరోజు విషెస్ చేసిన ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్తూ ఫ్యాన్స్ కి సైతం ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు . తారక్ లో ఉన్న మంచి గుణానికి ఇదే ఎగ్జాంపుల్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news