News' రామ‌బాణం ' ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. గోపీచంద్ భ‌లే ట్విస్ట్...

‘ రామ‌బాణం ‘ ఫ‌స్ట్ రివ్యూ వ‌చ్చేసింది.. గోపీచంద్ భ‌లే ట్విస్ట్ ఇచ్చాడే…!

యాక్ష‌న్ హీరో గోపీచంద్ గ‌త కొంత కాలంగా వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా కాలం కలిసిరాక ఇంకా మీడియం రేంజ్ హీరోగానే మిగిలి పోయాడు. గ‌తేడాది జీఏ 2 బ్యాన‌ర్లో మారుతి డైరెక్ష‌న్‌లో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ అనే సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యాక‌ప్‌, రాశీఖ‌న్నా హీరోయిన్‌.. మారుతి డైరెక్ష‌న్ ఇవేవి కూడా ఈ సినిమాను కాపాడ‌లేక‌పోయాయి. రిలీజ్‌కు ముందు స‌బ్జెక్ట్ డిఫ‌రెంట్‌గా ఉంది. సినిమా ఖ‌చ్చితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యి త‌న కెరీర్ గాడిలో ప‌డుతుంద‌ని గోపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాడు.

సినిమా కోసం అంద‌రూ క‌ష్ట‌ప‌డ్డా సినిమా ఎక్క‌డో గాడి త‌ప్పి డిజాస్ట‌ర్ అయ్యింది. దీంతో యేడాది గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ రామ‌బాణం అనే యాక్ష‌న్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. రేపు ఈ సినిమా రిలీజ్ అవుతోంది. గతంలో గోపీచంద్‌, డైరెక్ట‌ర్ శ్రీవాస్ కాంబినేషన్ లో లక్ష్యం – లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత వీరి కాంబోలో వ‌స్తోన్న మూడో సినిమా రామ‌బాణం కావడంతో హ్యాట్రిక్ కొడుతుంద‌న్న అంచ‌నాలు అంద‌రిలోనూ ఉన్నాయి.

ఇక ఈ సినిమా ప్రివ్యూ షో హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో వేయ‌గా.. సినిమా, మీడియా రంగాల‌కు చెందిన కొంద‌రు ప్ర‌ముఖులు ఈ సినిమాను చూశారు. సినిమాకు ప‌ర్వాలేదు అన్న టాక్ వ‌చ్చింది. మ‌రీ ఆహా.. ఓహో అదిరిపోయింద‌న్న టాక్ అయితే లేదు. రొటీన్ స్టోరీ అయ్యినా కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా ద‌ట్టించాడ‌ట‌.

కామెడీ, యాక్ష‌న్ స‌మ‌పాళ్ల‌లో ద‌ట్టించార‌ని… అన్న‌ద‌మ్ముల సెంటిమెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయట‌. ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా కంటే బాగా వ‌చ్చింద‌ని.. మాస్ ఆడియెన్స్‌కు బాగా న‌చ్చుతుంద‌ని.. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉండ‌డంతో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు సైతం న‌చ్చుతుంద‌న్న రిపోర్టులు వ‌స్తున్నాయి.

గోపీచంద్ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే అంశాలు ఉండ‌డంతో ఖ‌చ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంద‌న్న కాన్ఫిడెంట్‌తో ఉన్నాడు. మ‌రి గోపీ ఆశ‌లు రామ‌బాణం ఏ రేంజ్‌లో నెర‌వేరుస్తుంది ? లేదా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా రొటీన్‌గా కొట్టుకుపోతుందా ? అన్న‌ది రేపు తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news