News"ఆయన తోడు ఉంటే బాగుంటుంది".. లవ్ విషయాని సిగ్గుపడుతూ బయటపెట్టిన రష్మి.....

“ఆయన తోడు ఉంటే బాగుంటుంది”.. లవ్ విషయాని సిగ్గుపడుతూ బయటపెట్టిన రష్మి.. ఓ ఆడపిల్ల ఇంతకన్న తన ప్రేమను ఎలా బయటపెడుతుంది..?

సోషల్ మీడియాలో యాంకర్ రష్మీ కి కమెడియన్ సుడిగాలి సుధీర్ పై ఎలాంటి వార్తలు వస్తూ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ జంట పెళ్లి చేసుకుంటారా ..? లేదో..? తెలియదు కానీ ఈ జంటకు నిజంగానే పెళ్లి చేసేసారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కొందరు ఆకతాయిలు. ఈ ఇద్దరిని కపుల్గానే చూస్తూ అలాగే భావిస్తున్నారు . ఎంతలా అంటే రష్మి వేరొకరి పేరు చెప్తే ఆమె ట్రోల్ చేసే అంత దారుణంగా తయారైపోయింది పరిస్థితి. అంతేకాదు రష్మీ – సుధీర్ పేర్లు పక్క పక్కన లేకుండా ఉంటే ఆ షో ని డిజాస్టర్ చేసేస్తున్నారు .

కాకపోతే రీసెంట్ గా రష్మి మరోసారి కమెడియన్ సుధీర్ పై ఉన్న ప్రేమను ఓపెన్ గా చెప్పేసింది . ఈ క్రమంలోనే రష్మి మాట్లాడిన మాటలను వైరల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్ . మనకు తెలిసిందే రష్మీ – సుడిగాలి సుధీర్ జంట బుల్లితెరపై యమ పాపులారిటీ సంపాదించుకునింది. ఈ క్రమంలోనే రీసెంట్గా రష్మీ సిక్స్త్ సెన్స్ సీజన్ సెవెన్ కి గెస్ట్ గా హాజరైంది. ఈ క్రమంలోనే బ్రహ్మాజీ కూడా ఆమెతో ఈ షోలో పాల్గొన్నాడు .

బ్రహ్మాజీ ఆమెను ఫ్లార్డ్ చేయడానికి ట్రై చేశారు . ప్రోగ్రాంకి ఇది పెద్ద ఆకర్షణీయంగా నిలిచింది . అంతేకాదు “యాంకర్ ఓంకార్ ఓపెన్ గా రష్మి ని అడిగేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో తో డేటింగ్ చేయాలి అనుకుంటున్నారు..?” అంటూ పరోక్షకంగా అడిగేసాడు . ఈ క్రమంలోనే రష్మి మ్యాటర్ ని అర్థం చేసుకొని.. ఓపెన్ గా సుడిగాలి సుధీర్ పేరు చెప్పేసింది. సుధీర్ తోడుంటే నాకు చాలా బాగుంటుంది అంటూ ఓపెన్ గా తనపై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చింది . అయితే “తాను సుధీర్ ని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ..ఒక ఆడపిల్ల ఇంతకన్నా ఓపెన్ గా ఎలా చెప్పగలదు.. సుధీర్ అర్థం చేసుకో ..ఇప్పటికైనా పెళ్లి ప్రపోజల్ పెట్టు .. మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది “అంటూ నెటిజన్లు సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఈ రీల్ కపుల్ రియల్ కపుల్ గా మారుతుందో లేదో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news