Moviesకృష్ణం రాజు చనిపోయాక మళ్ళీ అలాంటి తప్పు చేస్తున్న ప్రభాస్..? ఫ్యాన్స్...

కృష్ణం రాజు చనిపోయాక మళ్ళీ అలాంటి తప్పు చేస్తున్న ప్రభాస్..? ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రెబల్ హీరో ప్రభాస్ . సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది.  ఆఫ్ కోర్స్ బాహుబలి సినిమా తర్వాత ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ అందుకొని ప్రభాస్ పేరు ఇప్పటికీ మారుమ్రోగిపోతుంది అంటే కారణం బాహుబలి సినిమా అని చెప్పాలి .

అంతేనా సినిమాకి వంద నుంచి 150 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటూ క్రేజీ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ ..ప్రెసెంట్ చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కుతున్నాయి . సినిమాల పరంగా దూసుకుపోతున్న ప్రభాస్ కృష్ణంరాజు చనిపోయిన తర్వాత తన పెళ్లి విషయాన్నీ అస్సలు పట్టించుకోవడం లేదు అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది .మరీ ముఖ్యంగా కృష్ణంరాజు బ్రతికున్నప్పుడు ఆయనకు ప్రామిస్ చేశారని.. ఖచ్చితంగా 2023లో పెళ్లి చేసుకుంటాను అంటూ మాటిచ్చారని ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

అయితే కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆ మాటను గాలికి వదిలేసిన ప్రభాస్ .. తన పెళ్లిపై ఊసే ఎత్తడం లేదు.  వాళ్ళ అమ్మగారు బలవంతం చేసినా సరే కామ్ గా ఉంటున్నారట . అటు పక్క అనుష్క కూడా పెళ్లి ఇప్పట్లో చేసుకునేటట్టే కనిపించడం లేదు . ఈ క్రమంలోనే అనుష్క ప్రభాస్ ఫాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు . మీరు పెళ్లి అయినా చేసుకోండి.. కనీసం వేరు వేరుగా అయినా లైఫ్ లో పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వండి .. ఇలా ఎటూ కాకుండా మిగిలిపోకండి అంటూ మండిపడుతున్నారు . మరికొందరు కచ్చితంగా 2023 ప్రభాస్ – అనుష్కకు పెళ్లి అయిపోతుంది అంటూ జోష్యం చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news