Movies"అలా ఉండడానికి నాకు ఏం ఇబ్బంది లేదు"..ఒక్క మాటతో వాళ్ల గూబ...

“అలా ఉండడానికి నాకు ఏం ఇబ్బంది లేదు”..ఒక్క మాటతో వాళ్ల గూబ గూయ్యమనిపించిందిగా..!!

హీరోయిన్ సమంత ఏం మాట్లాడిన భూతద్దంలో పెట్టి చూసి ట్రోల్ చేసే జనాలు ఎక్కువగా అయిపోతున్నారు . ఈ మధ్యకాలంలో సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సమంత ఉ అన్న తిట్లే.. ఊ ఊ అన్న తిట్లే.. ఏం చేసిన ట్రోలింగ్ చేస్తున్నారు . శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమతకు ఎదురైన ప్రశ్నలకు ఘాటుగా ఆన్సర్ ఇచ్చింది సమంత.

ఈ క్రమంలోనే హోస్ట్ అడిగిన పర్సనల్ ప్రశ్నలకు కూడా సమంత ఏ మాత్రం భయపడకుండా ఆన్సర్ ఇవ్వడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ప్రజెంట్ ఆరోగ్యం గురించిన ప్రశ్నించిన హోస్ట్ కి..”ఆరోగ్యం బాగుంది.. నౌ ఐ యాం టోటల్లీ ఆల్ రైట్”.. అంటూ రిప్లై ఇచ్చింది .

అంతేకాదు “బాలీవుడ్ లోనే వెబ్ సిరీస్ లు, సినిమాలో కంటిన్యూగా చేస్తున్నారు.. తెలుగులో అయితే ఆఫర్లు తక్కువగా ఉన్నాయి ” అంటూ ప్రశ్నించడంతో.. ” అలా ఏం లేదు బాలీవుడ్ లోనే కాదు.. తెలుగులో ఆఫర్లు వచ్చినా చేస్తాను ..అది వెబ్ సిరీస్ అయినా సినిమా అయినా.. కంటెంట్ , కధ బాగుంటే ఎలాంటి రోల్స్ అయినా చేస్తాను .. ఎలా నటించడానికి అయినా నాకు ఏం ఇబ్బంది లేదు” అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది.

అయితే సమంత ఫ్యాన్స్ ఆమె మాటలను ట్రెండ్ చేస్తున్నారు . కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత తెలుగు సినిమాలు చేయదని.. తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తుందని.. ముంబైకి మకాం మార్చేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి . ఈ ఆన్సర్ తో వాళ్ల గూబ గుయ్యమనిందా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా సరే సమంత ఒక్క ఆన్సర్ ఇస్తే దాంతో 100 క్వశ్చన్స్ కి క్లారిటీ దొరికేసిన్నట్లే అంటున్నారు సమంత ఫ్యాన్స్ . చూద్దాం శాకుంతలం సినిమా సమంత తలరాతను ఎలా మారుస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news