Moviesస‌మంత అంతా పెద్ద ఫేక్‌… మొత్తం న‌ట‌నే… ఆడేసుకుంటున్నారుగా…!

స‌మంత అంతా పెద్ద ఫేక్‌… మొత్తం న‌ట‌నే… ఆడేసుకుంటున్నారుగా…!

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల కాలంలో ఏం చేసిన కాంట్రవర్సీ అవుతోంది. ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా ఆమె నటించిన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఆమె ప్రమోషన్లలో చాలా సింపతి మాటలు మాట్లాడేసింది. యశోద సినిమాకు ముందు కూడా ఆమె సింపతి గేమ్ ఆడిందని.. ఆ సినిమా విషయంలో అది కొంతవరకు వర్కౌట్ అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి

ఇప్పుడు శాకుంత‌లం సినిమాకు అంత సీన్ లేదని.. ముందే అందరికీ అర్థమైంది. దీంతో సమంత చివరకు తన వ్యక్తిగత విషయాలు కూడా బయటపెట్టి తీవ్ర విమర్శల పాలయ్యింది. ప్రస్తుతం ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా లండన్ లో ఉన్నారు. అక్కడ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగా సమంత ఇంగ్లీష్ యాసకు సంబంధించి రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి.

కొందరు సమంత ఇటీవల మరి అతి చేస్తుందని.. ఆమెది ఫేక్ ఇంగ్లీష్ యాస అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు రానీయాస.. భాష నీకు అవసరమా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఆమె ఇంగ్లీష్ యాస కారణంగా కూడా ఆమె విప‌రీతంగా ట్రోలింగ్‌కు గుర‌వుతుంది. నీవు కేరళ నుంచి వచ్చావు అని గుర్తు చేయాలా ? అని కొందరు కామెంట్ చేస్తుంటే.. మరికొందరు ఈ ఏడుపు ఏంట్రా బాబు అని సెటైర్లు వేస్తున్నారు.

వచ్చిన భాషను మనకు వచ్చిన విధంగా మాట్లాడితే సరిపోతుంది అని.. మరీ ఇంత దీర్ఘం తీసి విమర్శల పాలు అవ్వాలా.. అది నీకు అవసరమా ? అని అంటున్నారు. అసలే శాకుంతలం సినిమా వల్ల సమంత చాలా ట్రోలింగ్‌కు గురైంది.. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ యాస‌తో మ‌రింత విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. ఇక ఇప్పుడు చివ‌ర‌కు చిట్టిబాబు లాంటి జ‌నాల‌కు తెలియ‌ని నిర్మాత మాట‌ల‌కు కూడా కౌంట‌ర్ ఇస్తూ మ‌రింత చుల‌క‌న అవుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news