Moviesనాని "దసరా" పబ్లిక్ టాక్: పుష్ప ను మించి పోయే హిట్...

నాని “దసరా” పబ్లిక్ టాక్: పుష్ప ను మించి పోయే హిట్ .. కళ్లు దొబ్బాయారా ..?

టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా దసరా . డెబ్ల్యు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొద్దిసేపటి క్రితం పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్స్ లో రిలీజ్ అయింది. అంతేకాదు నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో చించేసాడు అన్న రేంజ్ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి . ఈ సినిమాలో మిగతా నటుల పర్ఫామెన్స్ ఎలా ఉన్నా సరే .. సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ అన్ని తానై పోషించి నాని సినిమాని టాప్ రేంజ్ లో నిల్చోబెట్టాడు అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు .

మరీ ముఖ్యంగా ఈ సినిమాలో వెన్నెల పాత్రలో నటించిన కీర్తి సురేష్ కూడా తన పాత్రకి తగిన న్యాయం చేసింది అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్స్ చేస్తున్నారు . అయితే మరి కొంతమంది జనాలు ఈ సినిమా చూసిన తర్వాత సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా కంటే ఈ సినిమా వందరెట్లు బెటర్ గా ఉందని ..ఈ సినిమా అదిరిపోయే హిట్ను తన ఖాతాలో వేసుకోబోతుంది అంటూ కామెంట్స్ చేశారు .

ఈ క్రమంలోనే కొందరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయ్యారు. పుష్ప సినిమాకి దసరా సినిమాతో కంపారిజన్ ఏంటి..? ఏ సినిమాకి ఉండాల్సిన క్రేజ్ ఆ సినిమాకి ఉంటుంది .. పుష్ప సినిమా రిలీజ్ అయి సంవత్సరం అవుతుంది ..ఆ సినిమాను చూసే డైరెక్టర్ ఈ సినిమాను కాపీ కొట్టాడేమో..? పుష్ప సినిమాతో కంపేర్ చేయకండి ..? అంటూ పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నారు .

అంతేకాదు మరి కొంతమంది జనాలు కళ్ళు దొబ్బాయా..? ఇది ఆ సినిమాకి మించిన హిట్ ..? పుష్ప ముందు ఇది పనికిరాదు అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని రెచ్చకొడుతున్నారు . ఈ క్రమంలోని సోషల్ మీడియాలో నాని దసరా సినిమా టాక్ వైరల్ అవుతుంది. నాని దసరా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఇలా అక్కడక్కడ థియేటర్స్ వద్ద కొందరు ఫాన్స్ ఓవరాక్షన్స్ కి నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ అవుతుంది అంటూ నాని ఫాన్స్ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news