Moviesనాగ చైతన్యను నమ్మి మోస‌పోయిన హీరోయిన్‌... కెరీర్ ఢ‌మాల్‌...!

నాగ చైతన్యను నమ్మి మోస‌పోయిన హీరోయిన్‌… కెరీర్ ఢ‌మాల్‌…!

బోలెడన్ని ఆశలతో అక్కినేని నాగ చైతన్యని నమ్మి టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకొచ్చి ఇప్పుడు అవస్తలు పడుతోంది దివ్యాంశ కౌశిక్. మొదటి సినిమాలో పర్ఫార్మెన్స్ పరంగా దివ్యాంశ కౌశిక్ మంచి మార్కులే సంపాదించుకుంది. కానీ, ఎంతైనా సీనియర్ నటి సమంత ముందు తేలిపోక తప్పలేదు. నాగ చైతన్యతో మొదటి సినిమా చేసి ఆ తర్వాత ఆయనతో ప్రేమలో మునిగి తేలి చివరికి చైతూనే పెళ్లి చేసుకున్న సమంత ఇందులో సెకండ్ హాఫ్ ముందు ఎంట్రీ ఇస్తుంది.

అప్పటి వరకు దివ్యాంశ కౌశిక్ కి మంచి స్క్రీన్ స్పేస్ ఉంది. సాంగ్స్ ఉన్నాయి. రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఇన్నిటిలో అద్భుతంగా నటించినప్పటికీ ఒక్కసారిగా సమంత ఎంట్రీతో మొత్తం మారిపోతుంది. అప్పటివరకూ ప్రేక్షకులు దివ్యాంశ కౌశిక్ గురించే మాట్లాడుకుంటారు. కానీ, సమంత రాకతో ఆ తర్వాత ఆమె గురించి మాట్లాడుకునే అవకాశమే ఉండదు. అంతగా సమంత తన పర్ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను లాగేస్తుంది.

దాంతో మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అయినా కూడా దివ్యాంశ కౌశిక్ కెరీర్‌కి మాత్రం అది ఏమాత్రం ఉపయోగపడలేదు. ఆ తర్వాత మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ‌తో చేసిన రామారావు ఆన్‌డ్యూటీ ఫ్లాప్. మైఖేల్ పెద్దగా కలిసి రాలేదు. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ అవుతుంద‌ని ఆమె పెట్టుకున్న ఆశ‌లు అడియాస‌లే అయ్యాయి. ఆ క్రమంలో చేసిన ఏ సినిమా దివ్యాంశ కౌశిక్ కి క్రేజ్ తెచ్చిపెట్టింది లేదు. దాంతో అందాలను ఆరబోస్తూ ఫొటో షూట్స్ చేస్తోంది.

ఈ ఫొటో షూట్స్‌లో ఎద అందాలను అలా చూపిస్తూ అవకాశాల కోసం ఎరవేస్తుంది. మంచి హైట్..పర్ఫార్మెన్స్ పరంగా దివ్యాంశ కౌశిక్ అటు దర్శక నిర్మాతలలో ఇటు ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకుంది. కానీ, ఇప్పుడు సినిమాలలో హీరోయిన్ అవకాశాల కోసం మాత్రం అంగాంగ ప్రదర్శన తప్పలేదు. మరి ఈ ఫొటో షూట్స్ అమ్మడికి ఏమేరకి అవకాశాలను తెచ్చిపెడతాయో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news