MoviesJR NTR ఎన్టీఆర్‌కు బావ‌గా ఆ స్టార్ హీరో… కొర‌టాల శివ...

JR NTR ఎన్టీఆర్‌కు బావ‌గా ఆ స్టార్ హీరో… కొర‌టాల శివ సినిమా మ‌ల్టీస్టార‌రా ?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని మ‌రీ కొర‌టాల శివ సినిమా చేస్తున్నాడు. త్రిబుల్ ఆర్ రిలీజ్ అయ్యి మార్చి నెల‌కు యేడాది పూర్త‌వుతుంది. ఇప్ప‌టికీ ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. మ‌రోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో అస‌హ‌నం మామూలుగా లేదు. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుందా ? వ‌రుస అప్‌డేట్స్ ఎప్పుడు వ‌స్తాయా ? అని క‌ళ్లుకాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. చివ‌ర‌కు ఫ్యాన్స్ ప్ర‌శ్న‌ల‌తో ఎన్టీఆర్‌కు సైతం అస‌హ‌నం వ‌చ్చే ప‌రిస్థితి వ‌చ్చేసింది.

అమిగోస్ ప్రి రిలీజ్ ఈవెంట్లో సైతం ఏదైనా అప్‌డేట్ ఉంటే ఇంట్లో భార్య‌ల‌కు కాకుండా .. ముందుగా మీకే చెపుతాం అంటూ చెప్ప‌డంతో పాటు యాంక‌ర్ సుమపై సైతం కాస్త అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించేలా మాట్లాడిన సంగ‌తి తెలిసిందే. ఇలా అప్‌డేట్ల గురించి ఫ్యాన్స్ కంటిన్యూగా అడ‌గ‌డంతో ద‌ర్శ‌కుడు, మేక‌ర్స్‌పై తీవ్ర‌మైన ప్రెజ‌ర్ ఉంటుంద‌ని ఎన్టీఆర్ చెప్పాడు.

కొర‌టాల టెన్ష‌న్ ఆయ‌న‌కు ఉంది. ఆచార్య ప్లాప్ అవ్వ‌డంతో తీవ్ర‌మైన ఒత్తిడితో ఉన్నాడు. పైగా ఇది కొర‌టాల‌కు ఫ‌స్ట్ పాన్ ఇండియా సినిమా కావ‌డంతో స‌రైన కాంబినేష‌న్ సెట్ చేసేందుకే చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. హీరోయిన్గా జాన్వీక‌పూర్ ఆల్‌మోస్ట్ ఫిక్స్‌. కొర‌టాల గ‌త సినిమాల్లోనూ కాంబినేష‌న్లు సెట్ చేయ‌డంలో దిట్ట‌. మిర్చిలో స‌త్య‌రాజ్‌, న‌దియా- జ‌న‌తా గ్యారేజ్‌లో దేవ‌యాని, మోహ‌న్‌లాల్ – ఆచార్య‌లోకి రామ్‌చ‌ర‌ణ్ వ‌చ్చాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా పాన్ ఇండియా క్రేజీ ప్రాజెక్టు కావ‌డంతో ఈ ప్రాజెక్టులోకి కూడా ఓ స్టార్ హీరోను తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు అయితే జ‌రుగుతున్నాయ‌ట‌. ఆ హీరో ఎవ‌రో కాదు కోలీవుడ్ సీనియ‌ర్ క్రేజీ హీరో చియాన్ విక్ర‌మ్‌. విక్ర‌మ్ అంటే తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఉంది. పైగా ఈ ప్రాజెక్టులో విక్ర‌మ్ ఉంటే తెలుగుతో పాటు సౌత్ ఇండియా.. ముఖ్యంగా త‌మిళ్లో ఎన్టీఆర్ సినిమాకు మంచి బ‌జ్ ఉంటుంది.

అటు నార్త్‌లో జాన్వీక‌పూర్ ప్ల‌స్ అవుతుంది. కొర‌టాల ఇన్ని లెక్క‌లు వేసుకునే విక్ర‌మ్‌ను కూడా తీసుకుంటున్నాడ‌ట‌. ఎన్టీఆర్ బావ పాత్ర‌లో విక్ర‌మ్ క‌నిపిస్తాడ‌ని తెలుస్తోంది. న‌వంబ‌ర్ లోగా ఈ సినిమాను ఫినిష్ చేసేలా ప్లానింగ్ ఉంది. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ ప్ర‌శాంత్ నీల్ సినిమాకు వెళ్లిపోతాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news