Moviesగోపీచంద్ ' జిల్ ' సినిమాను బాల‌య్య 3 సార్లు ఎందుకు...

గోపీచంద్ ‘ జిల్ ‘ సినిమాను బాల‌య్య 3 సార్లు ఎందుకు చూశాడు…!

న‌ట‌సింహం బాల‌య్య హోస్ట్ చేస్తోన్న ఆహా ఓటీటీ టాక్ షో అన్‌స్టాప‌బుల్ సెకండ్ సీజ‌న్ కూడా స్వింగ్‌లో ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన అన్ని ఎపిసోడ్లు కూడా ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ను మించే ఉన్నాయి. అన్నింటికి మించి ఇప్ప‌టికే స్ట్రీమింగ్ అయిన ప్ర‌భాస్ ఎపిసోడ్‌తో పాటు త్వ‌ర‌లో స్ట్రీమింగ్ కానున్న ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎపిసోడ్లు చేస్తోన్న ర‌చ్చ అంతా ఇంతా కాదు.

ఇక ప్ర‌భాస్‌తో చేసిన బాహుబలి 1 ఎపిసోడ్ ఇండియ‌న్ ఓటీటీ హిస్ట‌రీలో స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ షో ఇప్ప‌టికే అతి త‌క్కువ టైంలోనే 50 మిలియ‌న్ల మినిట్స్ వ్యూస్ తెచ్చుకుంది. అలాగే 100 కోట్ల మిలియ‌న్ల మినిట్స్ వ్యూస్ కూడా త‌క్కువ టైంలోనే రాబ‌ట్టుకుంది. ఇక బాహుబలి పార్ట్ 2కూడా రిలీజ్ అయ్యింది. ఇందులో ఫ‌స్ట్ పార్ట్‌లో మిస్ అయిన ఫ‌న్ ఉండ‌డంతో ఇది కూడా దూసుకుపోతూ స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది.

ఇక రెండో ఎపిసోడ్లో ప్ర‌భాస్‌తో పాటు మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా వ‌చ్చాడు. వీరిద్ద‌రి మ‌ధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో కూడా షోలో చెప్ప‌క‌నే చెప్పారు. అయితే బాల‌య్య గోపీచంద్ న‌టించిన జిల్ సినిమా బాల‌య్య‌కు పిచ్చ‌పిచ్చ‌గా న‌చ్చేసింద‌ట‌. ఈ సినిమాను తాను ఏకంగా 3 సార్లు చూశాన‌ని చెప్పి బాల‌య్య గోపీచంద్‌కు బిగ్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చాడు.

జిల్ సినిమాలో హీరో క్యారెక్ట‌ర్ ట్రెండీ మేకోవర్ తనకు బాగా నచ్చిందని బాలకృష్ణ చెప్పారు. అయితే ఈ లుకింగ్ వెన‌క ప్ర‌భాస్ ఉన్నాడ‌ని.. బాహుబ‌లి న‌టుడికే పూర్తి క్రెడిట్ ఇస్తున్న‌ట్టు గోపీచంద్ చెప్పాడు. గోపీచంద్ రొటీన్ లుక్స్‌తో ఉంటోన్నందున .. లుక్స్‌తో పాటు గెట‌ప‌ర్ మార్చుకోమ‌ని ప్ర‌భాస్ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌. ప్ర‌భాస్ ఇచ్చిన స‌ల‌హా పాటించడం వ‌ల్లే… జిల్ సినిమాలో గోపీచంద్ ఫ్యాన్సీగా, స్టైలిష్ గా కనిపించాన‌ని గోపీ చెప్ప‌గా.. అలాగే మెయింటైన్ చేయ‌మ‌ని బాల‌కృష్ణ సూచించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news