Moviesవాట్: వరుణ్ కోసం నచ్చిన దాని వదులుకున్న చరణ్ .. ఏ...

వాట్: వరుణ్ కోసం నచ్చిన దాని వదులుకున్న చరణ్ .. ఏ బ్రదర్ కూడా చేయని త్యాగం చేశాడా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే వాళ్ళల్లోకి ప్రత్యేకంగా నిలుస్తారు రామ్ చరణ్ . చిరుత సినిమాతో మెగా ట్యాగ్ ను అందుకుంటూ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ .. మొదటి సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు . ఇక తర్వాత రెండో సినిమాకి దర్శకధీరుడు రాజమౌళి లాంటి డైరెక్టర్ చేతిలో పడి మగధీర సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ వేసుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్న చరణ్.. తన బ్రదర్ వరుణ్ తేజ్ కోసం చేసిన త్యాగం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ .. మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ పేరుకు అన్నదమ్ములు అయిన పర్సనల్గా మాత్రం బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా క్లోజ్ గా ఉంటారు . ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ తప్పులను సరి చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తన వద్దకు వచ్చిన మంచి హిట్ సినిమా స్టోరీ ను బ్రదర్ వరుణ్ తేజ్ కోసం త్యాగం చేశాడు.

మనకు తెలిసిందే.. వరుణ్ తేజ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచిన ఫిదా సినిమాని డైరెక్టర్ చేసింది శేఖర్ కమ్ముల. అయితే శేఖర్ కమ్ముల ఈ సినిమా కథను ముందుగా రామ్ చరణ్ కు వివరించారట . కాగ సినిమా స్టోరీ తెగ నచ్చేసిన ఆయన కెరియర్లో హిట్ పడుతుందని ఆశపడిన తన తమ్ముడి కోసం వరుణ్ తేజ్ కు ఈ కథను త్యాగం చేశాడట . నిజానికి ఎంత అన్నదమ్ములైనా సరే ఇలా సినిమా అవకాశాలను ఎవరు త్యాగం చేసుకోరు .. తమ ఖాతాలో హిట్ పడటానికే ట్రై చేస్తారు . కానీ బ్రదర్ కోసం ఇలాంటి డెసిషన్ తీసుకోవడం చరణ్ లోని గొప్ప మనసును మరోసారి ప్రూవ్ చేసింది. ప్రజెంట్ ఆర్సీ 15 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న చరణ్.. త్వరలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి రెడీగా ఉన్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news