Moviesహీరోయిన్ల‌తో టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు లిప్‌కిస్ బాండింగ్... తెర‌వెన‌క ఇంత న‌డుస్తోందా...!

హీరోయిన్ల‌తో టాలీవుడ్ ద‌ర్శ‌కుల‌కు లిప్‌కిస్ బాండింగ్… తెర‌వెన‌క ఇంత న‌డుస్తోందా…!

దర్శకుడు కథ చెప్పేటప్పుడే హీరోయిన్స్ ముద్దు సన్నివేశాలను అడుగుతున్నారా..? అంటే ఈ జనరేషన్ హీరోయిన్స్ కొందరు అడుగుతున్నారనేది లోలోపల వినిపిస్తున్నమాట. అదొక అడ్వాంటేజ్ అయిపోయింది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలలో హీరోహీరోయిన్ మధ్య కౌగిలింతలు, రొమాంటిక్ సన్నివేశాలున్నప్పటికీ బెత్తడు దూరం ఉండేది. ఈ విషయం సీనియర్ నటీమణులు ఎందరో వివరించారు కూడా.

Ramudu Bheemudu (1964) | V CINEMA - Movie, Review, Cast, Songs & Release Date

ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణ తరం వరకూ హీరోయిన్ అంటే చాలా జాగ్రత్తలు పాటించేవారు దర్శకనిర్మాతలు. అప్పట్లో ఐటెం సాంగ్ అనేది ఉన్నా..అందులో అందాల ఆరబోత అదుపు తప్పినంత ఉన్నా దానికంటూ ప్రత్యేకంగా వేరే నటీమణులు ఉండేవారు. అంతేకానీ, హీరోయిన్ ఎంతో పద్దతిగా కనిపించేవారు. కనీసం నాభి చూపించడానికి కూడా ఆస్కారం ఉండేది కాదు.

Tollywood Lip Kissing Scenes | Mahesh Babu | Allu Arjun | Rana Gopichand Naga - Filmibeat

ఆ తర్వాత కాలంలో హీరోయిన్స్ అయిన విజయశాంతి, శ్రీదేవి, మాధవి, రాధ, రాధిక, సుహాసిని లాంటి వారు చీర కట్టుకున్నా నాభి సొగసులు చూపించి ఆకట్టుకున్నారు. ఇంకాస్త తర్వాత వచ్చిన హీరోయిన్స్ కొద్దిగా హద్దులు చెరిపేసి ఇంకాస్త కవ్వించేలా అందాల ఆరబోతతో అలరించారు. అయితే, సినిమా ఒప్పుకున్నప్పుడే నిర్మాతతో ఏ రెమ్యునరేషన్ అయితే మాట్లాడి అగ్రిమెంట్ చేసుకుంటారో అదే తీసుకునేవారు.

List of Telugu heroes who raises heat on screen with lip lock kissing scene

కానీ, ఇప్పుడు ముద్దు సన్నివేశాలలో నటించాలంటే, బికినీ సూట్ ధరించి అందాలు ఆరబోయాలంటే దానికి అదనంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా దాన్ని ఓ కమర్షియల్ అంశంగా చూసి జనాలను థియేటర్స్ వరకూ రప్పించడానికి ఇప్పుడు గ్లామర్ క్వీన్స్ అడిగినంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు. కొందరు దర్శకులు – హీరోయిన్స్ మధ్య మంచి బాండింగ్ కుదిరి ఇలా అదనంగా హీరోయిన్స్‌కు రెమ్యునరేషన్ ఇవ్వడానికి కొన్ని ఘాటు సన్నివేశాలు, లిప్ లాక్స్ పెడుతున్నారు. ఇది హీరోయిన్స్‌కి బాగా కలిసి వస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news