Moviesఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే తమన్నా రేంజ్..మరోలా ఉండేదా..?

ఆ ఒక్క తప్పు చేయకుండా ఉంటే తమన్నా రేంజ్..మరోలా ఉండేదా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు లెక్కలు ఒకేలా ఉండవు. తారుమారవుతూ ఉంటాయి. వాటిని సరిగ్గా బ్యాలెన్స్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్ గా ఉంటేనే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా రాజ్యం ఏలగలరు. ఏ మాత్రం తప్పుడు అడుగులేసినా .. తప్పటి నిర్ణయాలు తీసుకున్న ఇండస్ట్రీ నుంచి తప్పుకోవాల్సిందే తప్పదు అంటూ సినీ విశ్లేష ప్రముఖులు చెప్పుకొస్తున్నారు . కాగా అదే లిస్టులో కి యాడ్ అయింది తమన్నా.

సినిమా ఇండస్ట్రీలో హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వాళ్ళల్లో తమన్నా కూడా ఒకరు. ఎటువంటి హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన స్టైల్ లో నటించి శ్రీ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తమన్నా.. ఆ తర్వాత హ్యాపీడేస్ తో హ్యాపీగా తన లైఫ్ ముందుకు తీసుకెళ్తుంది . ఈ సినిమా తర్వాత తమన్న కెరియర్లో వెనక్కి తిరిగి చూసుకునే రోజులు లేకుండా పోయాయి. అయితే మంచిగా సినిమాలు చేస్తున్న టైంలోనే కోలీవుడ్ హీరో తో ప్రేమాయణం నడిపి తన పరువును తీసుకుంది . నిజానికి తమన్న రేంజ్కి హీరో సెట్ అవ్వడని.. ఆ రోజుల్లో వార్తలు కూడా వైరల్ అయ్యాయి.

కానీ తమన్నా ఆ హీరోతో రాసుకుని పూసుకుని తిరగడం ..ఆ టైంలో మంచి మంచి సినిమా స్టోరీస్ రిజెక్ట్ చేయడం ..ఆ కారణంగానే కొందరు యంగ్ బ్యూటీస్ ఆమె ప్లేస్ ను భర్తీ చేయడంతో తమన్నా రేంజ్ డౌన్ అవుతూ వచ్చింది . కెరియర్ గ్రాఫ్ డౌన్ ఫాల్ అయింది ఆ తర్వాత హీరో వదిలేశాక పరిస్థితి అర్థం చేసుకున్న తమన్న ఏం చేయలేకపోయింది . ప్రజెంట్ తమన్నా పొజిషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన గుర్తుందా శీతాకాలం కూడా ఎవరు గుర్తుపెట్టుకో లేకపోయారు. అంత దారుణమైన టాక్ సంపాదించుకుంది . అంతకు ముందు రిలీజ్ అయిన బబ్లీ బౌన్సర్ కూడా బాధ పెట్టింది . ఇలా వరుస డిజాస్టర్ లా మధ్య తమన్నా నలిగిపోతుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news