Moviesఅబ్బాబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..ఆ విషయంలో మహేశ్ ని దాటేసిన ఎన్టీఆర్..!!

అబ్బాబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..ఆ విషయంలో మహేశ్ ని దాటేసిన ఎన్టీఆర్..!!

సినిమాలో ఎంత బిజీగా ఉన్నా ..సరే కొందరు స్టార్ హీరోలు అడ్వర్టైజ్మెంట్ లల్లో నటిస్తూ పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ ఉంటారు. కాగా మన టాలీవుడ్ లో అందులో ముందు వరుసలో ఉంటారు మహేష్ బాబు ,అల్లు అర్జున్ . స్టార్ స్టేటస్ కలిగిన ఈ హీరోలు పలు రకాల బ్రాండ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ రెండు చేతుల కోట్లలో సంపాదిస్తున్నారు. అంతేకాదు వీళ్ళు ఒక్కొక్క యాడ్ కి పరితోషకం సినిమా కన్నా ఎక్కువ తీసుకునే విధంగా ఉంటుంది అంటూ సినీ వర్గాలలో టాక్ వినిపిస్తుంది .

కాగా సినీ యాడ్స్ అడ్వర్టైజ్మెంట్ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసే విషయంలో దూసుకుపోతున్న మహేష్ బాబు ..అల్లు అర్జున్ కి గట్టి పోటీ ఇవ్వడానికి రంగంలోకి దిగాడు జూనియర్ ఎన్టీఆర్ . సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఇష్టపడడు . కెరియర్ మొదట్లో కొన్ని యాడ్స్ ప్రమోట్ చేసిన ఆ తర్వాత వాటికి ఫుల్ స్టాప్ పెట్టేసారు . కాగా రీసెంట్గా ఎన్టీఆర్ లిసియస్ అనే బ్రాండ్ ప్రోడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు .

 

ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫైనల్ గా మారాయి . కాగా ఇప్పటివరకు అడ్వర్టైజ్మెంట్స్ కి హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోగా మహేష్ రికార్డ్ నెలకొల్పాడు . కాగా ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసి నందమూరి హీరో సరికొత్త రికార్డును నెలకొల్పినట్టు తెలుస్తుంది . ఇప్పుడు తాజాగా ఎన్టీఆర్ ఈ కొత్త యాడ్ కి తీసుకున్న పారితోషికం చాలా ఎక్కువ అంటున్నారు . లక్షా రెండు లక్షల కాదు ఏకంగా కోటి 50 లక్షలు ఎక్కువగా చార్జ్ చేశాడట ఎన్టీఆర్. అయితే ఈ అమౌంట్ తారక్ డిమాండ్ చేయలేదట. సదరు కంపెనీ తారక్ కి ఆఫర్ చేసిందట.

కాగా ఈ స్థాయిలో ఎన్టీఆర్ కి రెమ్యూనరేషన్ ఇవ్వడం నిజంగా సూపర్ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . ఏది ఏమైనా సరే తాను అడుగుపెడితే ఎక్కడైనా తానే నెంబర్ వన్ అంటూ మరోసారి ప్రూవ్ చేశాడు ఎన్టీఆర్ .అటు వెండితెరపై నెంబర్ వన్ హీరోగా రాజ్యమేలుతున్న ఎన్టీఆర్ ..ఇటు బ్రాండ్ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుని నెంబర్ వన్ హీరో అనిపించాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news