Moviesఅతి చేస్తున్న కృతి శెట్టి.. ఈ టైంలో ఇదేం పోయేకాలం తల్లి..!?

అతి చేస్తున్న కృతి శెట్టి.. ఈ టైంలో ఇదేం పోయేకాలం తల్లి..!?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న కన్నడ యంగ్ బ్యూటీ కృతి శెట్టి ఓవర్ మరీ ఓవర్ చేస్తుందా..?అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న కృతిశెట్టి ఆ తర్వాత కూడా రెండు సినిమాలను మంచి పాజిటివ్ హిట్స్ గా మలుచుకుంది. ఈ క్రమంలోనే కృతి శెట్టి పేరు సోషల్ మీడియాలో, సినీవర్గాలలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . అంతే కాదు స్టార్ హీరో సైతం తమ సినిమాలో కావాలని మరి అమ్మడుకు అవకాశాలు ఇచ్చారు.

ఈ క్రమంలోనే నితిన్ , రామ్ , సుధీర్ బాబు ..లాంటి స్టార్ సినిమాలలో అవకాశాలు అందుకుంది. అయితే ఎవరు ఊహించని విధంగా మూడు సినిమాల్లో బిగ్ డిజాస్టర్ గా మారాయి . దీంతో మొదటి మూడు సినిమాలు హిట్ అయినా కృత్తి కి ఆ తర్వాత మూడు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఈ క్రమంలో డైలమాలో పడిన కృతి శెట్టి సినిమా అవకాశాలు దక్కించుకోవడానికి హాట్ హాట్ ఫోటోషూట్స్ చేసి తన పేరు జనాలు మర్చిపోకుండా గుర్తుచేస్తుంది.

అయితే కోలీవుడ్ లోనూ అవకాశాలు సంపాదించుకున్న కృతిశెట్టి రీసెంట్గా బాలీవుడ్ లో అవకాశం కూడా వచ్చింది. ఇదివరకే నాని శ్యామ్ సింగ రాయ్.. బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న టైంలో కృతిశెట్టికి ఆఫర్ వచ్చింది. అయితే ఆఫర్ ని ఓపెన్ గా రిజెక్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ . అప్పుడు అంటే తెలుగులో అవకాశాలు ఉన్నాయి ..ఇప్పుడు అలా కాదు డౌన్ అయిపోతుంది. ఇలాంటి టైంలో బాలీవుడ్ నుంచి ఆఫర్స్ వస్తే బుద్ధున్న హీరోయిన్ ఎవరు వదులుకోదు ..కానీ కృతి శెట్టి మాత్రం నేను అన్న మాటకే కట్టుబడి ఉంటానని బాలీవుడ్ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోని కృతి శెట్టి తన పేరుని మరింత పాపులారిటీ చేసుకోవడానికి తెలుగు ప్రజలకు మరింత దగ్గర ఇవ్వడానికి బాలీవుడ్ బడా ఆఫర్ సైతం రిజెక్ట్ చేసింది.

దీనితో కృతిశెట్టి తీసుకుని నిర్ణయానికి సినీ ఇండస్ట్రీ షాక్ అయింది . ఏనాడు హీరోయిన్ ఒకే ఇండస్ట్రీపై డిపెండ్ అవ్వకూడదు.. అలా డిపెండ్ అయితే కచ్చితంగా స్టార్ హీరోయిన్ గా మారలేదు.. అన్ని భాషల్లోనూ పాపులారిటీ సంపాదించుకోవాలి. కాజల్ , సమంత, తాప్సీ , రకుల్ లాంటి స్టార్ హీరోయిన్ తెలుగు తమిళ్ హిందీ భాషల్లో సినిమాలో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. అంతేకాదు శ్రీదేవి లాంటి స్టార్ హీరోయిన్ కూడా అన్ని భాషల్లో సినిమాల్లో నటించి యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది . ఇలాంటి టైంలో కృతిశెట్టి తీసుకున్న డెసిషన్ ముమ్మాటికి తప్పే అంటున్నారు ఫ్యాన్స్ . చూడాలి ఆ విషయంలో డెసిషన్ మార్చుకుంటే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news