Moviesఫస్ట్ టైం ఆమెను అలా చూడగానే లవ్ లో పడిపోయా..ఎట్టకేలకు ఓపెన్...

ఫస్ట్ టైం ఆమెను అలా చూడగానే లవ్ లో పడిపోయా..ఎట్టకేలకు ఓపెన్ అప్ అయిన రౌడి హీరో..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అందాల కుందనపు బొమ్మ. కొన్నాళ్ల క్రితం వరకు ఇదే మాటని అందరు జనాలు చెప్పుకొచ్చారు. అయితే ఒక సంవత్సరం ముందు నుంచి ఈమె కుందనపు బొమ్మ కాదు ..కన్నింగ్ బొమ్మ అంటూ జనాలు చెప్పుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ సమంత-నాగచైతన్య కు కూడా ఇవ్వడమే . ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట సంవత్సరం ముందు వరకు బాగానే ఉన్నారు.

కానీ ఎవ్వరు ఊహించని విధంగా విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించింది. అంతే కాదు ప్రజెంట్ సింగిల్ గా బ్రతుకుతూ ఎవరి లైఫ్ వాళ్ళది అన్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. విడాకులు తర్వాత నాగచైతన్య పై ఎక్కువ రూమర్స్ వినిపించినప్పటికీ సమంత పై మాత్రం కంటిన్యూగా వినిపిస్తున్నాయి. ఆమెకు వేరే హీరోతో సంబంధం ఉందని ..ఆ కారణంగా నాగచైతన్య కూడా విడాకులు ఇచిచ్చీందంటూ సమంత ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు . అయితే దీనిపై సమంత తన వర్షన్ వినిపించి వినిపించి.. విసుకు వచ్చి వదిలేసి సినిమాలు చేసుకుంటుంది.

రీసెంట్ గా ఆమె నటించిన సినిమా యశోద . ఈ సినిమారిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కి రెడీ అయిన సమంతా.. రీసెంట్గా యశోద సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు . కాగా ఈ సినిమాను ఐదు భాషల్లో ఐదుగురు స్టార్ హీరోస్ రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే తెలుగులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ యశోద సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసి సమంత పై సంచలన ట్విట్ చేశాడు. ఈ సందర్భంగా రౌడీ హీరో సామ్ మీద అభిమానాన్ని చాటుకున్నాడు.

ఆయన తన ట్విట్టర్ ఖాతాలో..” నేను కాలేజీ చదువుకునే రోజుల్లో సమంతను మొట్టమొదటిసారిగా వెండితెరపై చూసిన క్షణాన ప్రేమలో పడిపోయాను . ఇప్పటికీ ఆమెను నేను ఆరాధిస్తూనే ఉన్నాను “అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఒక్కసారిగా సమంత విజయ్ దేవరకొండ పేర్లు వైరల్ గా మారాయి .అంతేకాదు త్వరలోనే వీరిద్దరు కలిసి తెరపై కనిపించబోతున్నారు . శివనిర్మాణ డైరెక్షన్లో ఖుషి అనే సినిమాలో సమంత హీరోయిన్గా విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్నారు . చూడాలి మరి వీళ్ళిద్దరి రొమాన్స్ తెరపై ఎలా వర్క్ అవుట్ అవుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news