Moviesస‌మంతకు చిన్న‌యికి ఎక్క‌డ చెడింది... ఇంత గ్యాప్ ఎందుకు..?

స‌మంతకు చిన్న‌యికి ఎక్క‌డ చెడింది… ఇంత గ్యాప్ ఎందుకు..?

చెన్నై చిన్న‌ది స‌మంత చైతుతో విడాకుల త‌ర్వాత కొన్నాళ్ల పాటు బాగా వార్త‌ల్లో నిలిచింది. త‌ర్వాత ఏమైందో కాని స‌డెన్‌గా సోష‌ల్ మీడియాకు కాస్త దూరంగా ఉంటోన్న ప‌రిస్థితి. ఆమెకు స్కిన్ ప్రాబ్ల‌మ్స్ బాగా ఉన్నాయ‌ని.. కొద్ది రోజుల పాటు ఆయుర్వేద వైద్యం చేయించుకున్న ఆమె స్పెష‌ల్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికా వెళ్లింద‌ని.. అందుకే సైలెంట్‌గా ఉంద‌ని కూడా అంటున్నారు. ఇటీవ‌లే ఆమె కోయంబ‌త్తూరు ఆశ్ర‌మంలో ఉన్న ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

ఇక స‌మంత న‌టిస్తోన్న య‌శోద‌, శాకుంత‌లం సినిమాలు కూడా ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌ని ప‌రిస్థితి. ఇక స‌మంత ఈ రోజు ఇంత క్రేజ్‌తో ఉండ‌డానికి కార‌ణం ఆమె న‌ట‌న ఎంత కీల‌క‌మో.. ఆమె హ‌స్కీ వాయిస్ కూడా అంతే ఇంపార్టెంట్‌. అయితే స‌మంత‌కు ఈ వాయిస్ దానం చేసింది సింగ‌ర్ చిన్మ‌యి. స‌మంత జీవితంలో ఈ వాయిస్సే బాగా హైలెట్‌. ఈ రోజు స‌మంత ఇంత స్టార్ అవ్వ‌డంతో సింగ‌ర్ చిన్న‌యి పాత్ర‌, ఆమె వాయిస్ కూడా ఎంతో ఉన్నాయ‌నే చెప్పాలి.

సామ్ బాడీ లాంగ్వేజ్‌కు, చిన్మ‌యి స్వ‌రం తోడ‌వ్వ‌డంతో తిరుగులేకుండా పోయింది. అస‌లు తెలుగు, త‌మిళ్ ప్రేక్ష‌కులు సామ్‌ను ఈ రోజు ఇంత‌లా ఇష్ట‌ప‌డుతున్నారు అంటే ఆమె చేసిన పాత్ర‌లే కాదు.. ఆమె చెప్పిన డైలాగులు కూడా కార‌ణం. అయితే మ‌హాన‌టి సినిమా టైం నుంచి ఎందుకోగాని చిన్న‌యిని సామ్ ఎవాయిడ్ చేస్తూ వ‌స్తోంది. అస‌లు ఇద్ద‌రి మ‌ధ్య గ్యాప్ పెర‌గ‌డానికి కార‌ణం ఏంట‌న్న‌ది మాత్రం బ‌య‌ట‌కు రాలేదు.

చిన్మ‌యి త‌ప్పుకున్నాక స‌మంత ఓన్ డ‌బ్బింగ్ చెప్పుకున్న ప్రాజెక్టుల‌కు అంత క్రేజ్ ఏం రాలేదు. కేఆర్కే లాంటి సినిమాలు త‌న్నేశాయి. ఇక ఇప్పుడు య‌శోద మేక‌ర్స్ మ‌ళ్లీ చిన్న‌యి చేత డ‌బ్బింగ్ చెప్పించాల‌ని చూస్తున్నార‌ట‌. స‌మంత అందుకు మాత్రం ఒప్పుకోవ‌డం లేద‌ట‌. కార‌ణం ఏంటి ? అస‌లు చిన్మ‌యి అంటే ఎంతో లైక్ చేసే స‌మంత‌కు ఆమెతో ఎందుకు గ్యాప్ వ‌చ్చింద‌న్న‌ది ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌. చిన్మ‌యిని వ‌దుల‌కోవ‌డం అంటే స‌మంత త‌న కెరీర్‌ను కూడా చాలా వ‌ర‌కు రిస్క్‌లో పెట్టుకున్న‌ట్టే అంటున్నాయి ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news