Moviesఆ పాపమే నయన్ పాలిట శాపమా..? హీట్ పెంచేసిన ప్రభుదేవా...

ఆ పాపమే నయన్ పాలిట శాపమా..? హీట్ పెంచేసిన ప్రభుదేవా భార్య మాటలు..!!

యస్ ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఓ పక్క నయనతార సరోగసి ప్రాసెస్ ద్వారా చిక్కుల్లో ఇరుక్కున్న మ్యాటర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంటే ..మరోపక్క ఆమె గత తాలూకా ఎఫైర్స్ వాటి తాలూకా శాపనార్ధాలు ట్రోల్ చేస్తున్నారు నయనతార హేటర్స్. మనకు తెలిసింది నయనతార సినీ కెరియర్ మొదలుపెట్టిన కొత్తలో బోలెడు మందితో ఎఫైర్ నడిపింది. లవ్ అంటూ కొంతమంది..ముద్దులు అంటూ మరికొంతమంది.. నయనతారను బాగా వాడుకున్నారు. ఆమె కూడా అన్ని తెలిసే రంగంలోకి దిగ్గింది అంటారు కొందరు.

అయితే, తీరా మ్యాటర్ ఫినిష్ అయ్యాక నయన్ వాళ్లు దూరంగా ఉండిపోయారు. ఆఫ్ కోర్స్ తప్పు ఎవరిదైనా సరే దాని పాపం మాత్రం నయనతారకు చుట్టుకుంది . మనకు తెలిసిందే నయనతార గత తాలూకా బాయ్ ఫ్రెండ్ లిస్టులో కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు, ప్రభుదేవా కూడా ఒకరు. అబ్బో ఆ టైంలో ప్రభుదేవా నయనతార చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఏకంగా ఒకే కారులో తిరగడం మీడియా ముందు చేతిలో చేయి వేసుకోవడం.. మీడియా వెనక ఏం చేస్తారో మనకు తెలియదు.. ఏదైనా చేయొచ్చు ..చేసినా బయటికి రాదు.. వచ్చిన పెద్దగా పట్టించుకోరు ..అలాంటి బిహేవియర్ తో నయనతార గతంలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది .

అయితే నయనతార ప్రభుదేవా పెళ్లి చేసుకోవాలని అంత సెట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభుదేవా మొదటి భార్య నయనతారపై దుమ్మెత్తి పోసింది. ప్రభుదేవా మొదటి భార్య రమాలత్ నయనతారను ఓ రేంజ్ లో బూతులు తిట్టింది. ” అది ఆడదేనా అంటూ మండిపడింది.. నా కాపురంలో నిప్పుల పోసావు.. నువ్వు సర్వం నాశనం అవుతావు అంటూ మీడియా ముందే శాపనార్ధాలు పెట్టింది . అంతే కాదు నన్ను ఈ విధంగా ఏడిపించుకుంటున్న నీకు నా ఉసురు తగలకుండా పోదు.. నా కన్నీటికి నువ్వే కారణం.. నా జీవితాన్ని నాశనం చేసేసావు.. నా భర్త నానుంచి దూరం చేస్తున్న నయనతార అరెస్ట్ చేయాలి ..చట్టాలు కఠినంగా శిక్షించాలి ..నా కంటికి నయనతార కనిపిస్తే ఏం చేస్తానో నాకే తెలియదు ..”అంటూ ఆమెను దుష్ట శక్తి అంటూ పోల్చింది రమాలత్. అయితే ప్రజెంట్ ఆమె గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. నయనతార సరోగసి ప్రాసెస్ కానీ నిజమైతే కచ్చితంగా జైలుకి వెళ్ళడం ఖాయం అంటున్నారు తమిళ సినీ విశ్లేషకులు . ఒకవేళ అదే జరిగితే నయనతారకు అంతకన్నా పరువు తక్కువ పని మరొకటి ఉండదు. దీంతో ప్రభుదేవా మొదటి భార్య శాపమే నయనతార ఇప్పుడు బాధపడడానికి కారణం అంటూ ట్రెండింగా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news