Movies"ఓసేయ్..నీ అంతు చూస్తా".. రాజ్ తరుణ్ సంచలన వీడియో ..!!

“ఓసేయ్..నీ అంతు చూస్తా”.. రాజ్ తరుణ్ సంచలన వీడియో ..!!

రాజ్ తరుణ్ .. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ , వెబ్ సిరీస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ..సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంటర్ అయ్యి.. తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ టాలీవుడ్ యంగ్ హీరోగా దూసుకుపోతున్న ఈ కుర్ర హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే . ఉయ్యాల జంపాల సినిమాతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు .

 

ఇక తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ అభిమానులను ఉత్సాహపరిచాడు. కాగా గత కొంతకాలంగా ఒక అవకాశం కూడా అందుకొని రాజ్ తరుణ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాడు. దానికి మెయిన్ రీజన్ ఆయన కొద్దిసేపటి క్రితం చేసిన వీడియోనే.. తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో రాజ్ తరుణ్ వీడియో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ ..”హలో అండి అందరికీ నమస్కారం. నేను సడన్గా ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది. మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాలి. నా జీవితంలో అమ్మాయి అనే టాపిక్ వస్తుందని ..నేను కలలో కూడా ఊహించలేదు. నాకు చిన్నప్పటినుంచి ఓ భయం ఉంటుంది . అమ్మాయిలతో మాట్లాడాలన్నా వాళ్లతో క్లోజ్ గా మూవ్వాలన్న చాలా భయం. దీంతో నాకు అర్థం అయిపోయింది మన జీవితంలో ఈ లవ్వులు, గివ్వలు సెట్ కావు. నాకు పెళ్లి చేయండి రా బాబోయ్ అని మా అమ్మ నాన్న అడిగేసాను “.

“మొదట అందరూ కంగారు పడ్డారు.. ఆ తర్వాత నా కక్కుర్తి అర్థం చేసుకొని ఒక సంబంధం చూశారు. ఇంకేముంది హమ్మయ్య పెళ్లి సెట్ లైఫ్ హిట్ అన్న రేంజ్ లో ఫిక్స్ అయిపోయాను. మండపం సెట్ చేసుకున్నాము రాబందులు… అదే చుట్టాలు వచ్చారు . పండక్కి తయారుచేసిన గంగిరెద్దుల రెడీ చేసి కూర్చోబెట్టారు . మండపానికి తీసుకెళ్లే టైంకి పెళ్లికూతురు చెల్లి ఓ లెటర్ తెచ్చింది. నేను చెప్పలేను ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా.. మొగుడు పోయి ఏడుస్తుంటే డాష్ డాష్ డాష్ అనే సామెత ఉంది . చచ్చిన పాముని ఇంకా ఎంతసేపు చంపుతారు వాళ్ళని కాదు ఒసేయ్ నిన్ను నువ్వు ఎక్కడున్నా పట్టుకుంటా నీ అంత చూస్తా.. రేపే నీ ఫోటో ఆన్లైన్లో పెడతా “అంటూ ఓ రేంజ్ లో ఊగిపోయాడు . అఫ్ కోర్స్ ఇదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిందని అర్థమవుతుంది. చూడాలి ఈ సినిమాతో రాజ్ తరుణ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో..!!

 

 

View this post on Instagram

 

A post shared by Raj Tarun (@rajtarunn)

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news