Moviesపండగ చేసుకోండ్రా అబ్బాయిలు..ఫ్యాన్స్ కి కృతి బంపర్ ఆఫర్..!?

పండగ చేసుకోండ్రా అబ్బాయిలు..ఫ్యాన్స్ కి కృతి బంపర్ ఆఫర్..!?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని కొన్నిసార్లు అదృష్టం మనకు తెలియకుండానే వరిస్తుంది. ఆ లిస్ట్ లోకి వస్తుంది కన్నడ బ్యూటీ కృతి శెట్టి. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన పనిలేదు. మెగా మేన అల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటించిన ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన కృతి శెట్టి.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్టులోకి యాడ్ అయిపోయింది.

అంతేకాదు ఆ తర్వాత ఆమె నటించిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధించచాయి. దీంతో సినీ ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లక్కి హీరోయిన్ అయిపోయింది . అయితే కృతిశెట్టి లాస్ట్ నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి . ఈ క్రమంలోనే కృతి శెట్టి అభిమానుల కోసం బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ కృతి శెట్టి మలయాళం లో ఓ సినిమా.. తమిళ్ లో రెండు సినిమాలు.. తెలుగులో రెండు సినిమాలు చేస్తుంది.

నాగచైతన్య చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేత్సున్న కృతి శెట్టిని ఈ సినిమా పై బోలెడు ఆశలు పెట్టుకుని ఉంది. ఒక్కవేళ ఈ మూవీ విజయం సాధిస్తే కృతి శెట్టి.. తన అభిమానులను డైరెక్ట్ గా కలిసే ఛాన్స్ ఇస్తుందట. అభిమానుల కోసం ఓ మీటింగ్ ఏర్పాటు చేసి తన ఫాన్స్ ను డైరెక్ట్ గా మీట్ అవుతుందట. నిజంగా ఇది కృతశెట్టి అభిమానులకు పండగ చేసుకునే న్యూస్ అనే చెప్పాలి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news