Moviesఆ హీరోయిన్‌తో బెడ్‌మీద ప‌డుకొన్న అల్లు శిరీష్‌...!

ఆ హీరోయిన్‌తో బెడ్‌మీద ప‌డుకొన్న అల్లు శిరీష్‌…!

టాలీవుడ్‌లో అల్లు వార‌బ్బాయి అల్లు శిరీష్ కొత్త‌జంట – శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు – ఒక్క క్ష‌ణం సినిమాల‌తో న‌టుడిగా ఫ్రూవ్ చేసుకున్నాడు. అయితే గ‌త రెండేళ్లుగా లాంగ్ గ్యాప్ తీసుకున్న శిరీష్ ఇప్పుడు ఊర్వ‌శివో రాక్ష‌సివో సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. అనూ ఎమ్మ‌న్యుయేల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాకు రాకేశ్ శ‌శి ద‌ర్శ‌కుడు. ఈ సినిమా వ‌చ్చే నెల 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.. గ‌త కొంత కాలంగా శిరీష్ ఈ సినిమా కోసం హీరోయిన్ అనూతో ట్రావెల్ అయ్యాడు.

ఈ క్ర‌మంలోనే అనూకు, శిరీష్‌కు మ‌ధ్య ప్రేమాయ‌ణం న‌డుస్తోంద‌న్న వార్త‌లు కూడా వ‌స్తున్నాయి. వీరు పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని… పెళ్లి చేసుకున్నా చేసుకుంటార‌ని కూడా టాక్ రావ‌డంతో శిరీష్ క్లారిటీ ఇచ్చాడు. త‌మ ఇద్ద‌రి అభిరుచులు క‌లిశాయ‌ని.. తాను బేసిక్‌గా సైలెంట్ అందువ‌ల్ల ఇద్ద‌రికి క‌నెక్ట్ అయ్యిందంటూ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశాడు. శిరీష్ క్లారిటీలో వారు ప్రేమ‌లో ఉన్నారా ? లేదా ? అన్న‌ది మాత్రం స‌రిగా తెలియ‌లేదు.

ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్లు కూడా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన ప్ర‌మోష‌న్ కంటెంట్ అంతా బ‌జ్ క్రియేట్ చేసింది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ ఆక‌ట్టుకోగా తాజాగా క‌లిసుంటే అనే మ‌రో ప్ర‌మోష‌న‌ల్ సాంగ్‌ను కూడా రిలీజ‌జ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఊర్వశివో రాక్షసివో నుంచి ఓ బ్యూటిఫుల్ పోస్టర్ వ‌దిలారు. ఈ పోస్ట‌ర్లో అల్లు శిరీష్ – అనూ ఎమ్మాన్యుయేల్ ఇద్ద‌రూ ఒకే బెడ్ మీద ఉండ‌డంతో పాటు మాంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నారు.

ఈ పోస్ట‌ర్ చూస్తేనే ఇది రొమాంటిక్ సాంగ్ అని క్లారిటీ వ‌స్తోంది. ఏదేమైనా బెడ్ సీన్‌తో అయితే శిరీష్ – అనూ అంచ‌నాలు పెంచేశారు. ఈ సినిమాతో హిట్ కొడితే ఇద్ద‌రి కెరీర్ల‌కు మంచి ఊపు వ‌స్తుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news