Moviesసందీప్ కిషన్ ని తొక్కేస్తున్న స్టార్ సన్స్.. ఒక్క మాటతో పగిలిపోయే...

సందీప్ కిషన్ ని తొక్కేస్తున్న స్టార్ సన్స్.. ఒక్క మాటతో పగిలిపోయే ఆన్సర్..నిజంగా సాహసమే?

సినిమా ఇండస్ట్రీలో హీరోలకి కొదవలేదు. తాతల పేర్లు చెప్పుకొని.. నాన్నల పేర్లు చెప్పుకొని సినీ ఇండస్ట్రీలో బతికేస్తున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు . అయితే సొంత కాళ్లపై ఇండస్ట్రీకి వచ్చి టాలెంట్ తో బ్రతుకుదాము అన్న సామాన్యుల ఆశలను తొక్కేస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో సన్స్. ఎప్పటి నుంచో వైరల్ గా మారింది. కేవలం బయట జనాలే కాదు సినీ స్టార్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు . టాలెంట్ ఉన్న మమ్మల్ని పైకి ఎదగనివ్వడం లేదు అంటూ చాలామంది ఓపెన్ గానే చెప్పుకొచ్చారు.

మొన్నటికి మొన్న కార్తికేయ 2 ప్రమోషన్స్ లో భాగంగా నిఖిల్ స్టేజి పైన ఏడ్చేసాడు . తన సినిమాను కావాలని కొందరు అడ్డుకుంటున్నారని పరోక్షంగా కామెంట్స్ చేసి వార్తల్లో హెడ్ లైన్స్ లో నిలిచారు. కాగా మరోసారి అలాంటి వార్తల కారణంగా సందీప్ కిషన్ సోషల్ మీడియాలో హైలెట్ గా మారారు . మనకు తెలిసిందే సందీప్ కిషన్ పలు తెలుగు సినిమాల్లో నటిస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా సందీప్ కిషన్ నటనను బయటపెట్టింది . అంతే కాదు ఆ తర్వాత సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్, ఫ్రెండ్ రోల్స్ చేసుకుంటూ తన సినీ కెరియర్ని కొనసాగిస్తున్నారు సందీప్ కిషన్ . త్వరలోనే మైఖేల్ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.

ఫస్ట్ టైం పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమాతో సందీప్ కిషన్ జనాలకు కనిపించబోతున్నాడు. రీసెంట్గా ఈ సినిమా నుంచి విడుదలైన హాట్ పోస్టర్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇలాంటి క్రమంలోనే మైఖేల్ సినిమాను అడ్డుకోవడానికి కొందరు టాలీవుడ్ స్టార్ హీరో సన్స్ చూస్తున్నారు అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు రీసెంట్గా ఇలాంటి వాళ్ళకి మైండ్ బ్లాక్ ఆయేలా తన బాదీ ని మార్చేసుకున్నాడు. ఈ సినిమా కోసం ఈ హీరో ఏకంగా 24 కేజీలు తగ్గాడు. ఎంతమంది స్టార్స్ తొక్కేసినా సరే మనలో టాలెంట్ ఉంటే జనాలు ఆదరిస్తారు అంటూ పగిలిపోయే ఆన్సర్ వాళ్లకు ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మరి చూడాలి ఈ సినిమా సందీప్ కిషన్ లైఫ్ ని ఎలా టర్న్ చేయబోతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news