Moviesరణవీర్ తో అలాంటి పనులు..భరించలేకపోయాను..దీపిక కామెంట్స్ వైరల్..!!

రణవీర్ తో అలాంటి పనులు..భరించలేకపోయాను..దీపిక కామెంట్స్ వైరల్..!!

దీపికా పదుకొనే ..వామ్మో అమ్ముడు అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. బాలీవుడ్ బ్యూటీగా పాపులర్ అయిన దీపిక.. తనదైన స్టైల్ లో యాక్టింగ్ చేస్తూ.. అప్పుడప్పుడు బోల్డ్ ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. ఉన్నదు ఉన్నట్టు ముఖాన్ని మాట్లాడే అమ్మాయి అంటూ ఓ పేరు కూడా తెచ్చుకుంది. మనకు తెలిసిందే సినీ ప్రమోషన్స్ లో భాగంగా ఏ ఫంక్షన్ కి వచ్చినా దీపిక హైలెట్ గానే నిలుస్తూ ఉంటుంది. రిపోర్టర్ ప్రశ్నలకు నిర్మొహమాటంగా ఆన్సర్ చెప్పడంలో దీపిక తర్వాత ఎవరైనా.. అందుకే బాలీవుడ్ రిపోర్టర్స్ ఆమెను ప్రశ్నించడానికి భయపడుతుంటారు.

కాగా బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..తన పెళ్లికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో దీపిక మాటలు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. దీపికా మాట్లాడుతూ..” నేను రణవీర్ ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మా మధ్య ప్రేమ ఎలా పుట్టిందో కూడా నాకు తెలియదు. నేను రణవీర్ ని మీట్ అవ్వకముందు అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. ఇండస్ట్రీలో ఉండే ఒక హీరోని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను సిద్ధంగా లేను. వాళ్ళ పై వచ్చే రూమర్స్ .. వేరే వాళ్లతో శారీరకంగా సంబంధం పెట్టుకుంటారు.. అనే భ్రమ లో ఉండేదాని.

పైగా అలాంటి హీరోలను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా డివోర్స్ వరకు వెళ్తుందని భయపడ్డాను. అందుకే హీరోలను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. దాదాపు 13 ఏళ్ల పాటు నాతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు కూడా నన్ను మోసం చేసి వెళ్లిపోయారు. ఈ బాధతో ఇంకా అసలు అబ్బాయిలకి దూరంగా ఉండాలనుకున్నాను. కానీ, రణవీర్ రణవీర్ పరిచయం అయ్యాక అవన్నీ మర్చిపోయాను. ప్రేమ మీద నమ్మకం కలిగింది. పెళ్లంటే గౌరవం పెరిగింది. ఇప్పుడు నేను మీ ముందు నిల్చోని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం ఆ ప్రేమే. మీరు ఎవ్వరిని ఇష్టపడిన వాళ్లతో 100% నిజాయితీగా ఉండండి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దీపిక కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news