Moviesవిజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో వేణుస్వామి చెప్పిందే జ‌రిగిందా.. ఆ భ‌యంక‌ర నిజం...

విజ‌య్ దేవ‌ర‌కొండ విష‌యంలో వేణుస్వామి చెప్పిందే జ‌రిగిందా.. ఆ భ‌యంక‌ర నిజం ఇదే…!

రెండున్న‌రేళ్ల నుంచి ఊరిస్తూ వ‌చ్చిన లైగ‌ర్ సినిమా ఈ రోజు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. విజ‌య్ – పూరి కాంబినేష‌న్‌, అన‌న్య పాండే హీరోయిన్‌… అటు క‌ర‌ణ్ జోహార్ బాలీవుడ్‌కు బ్యాక‌ప్‌గా ఉన్నాడు. ఛార్మీ అండ‌దండ‌లు పూరికి ఉండ‌నే ఉన్నాయి. అయితే ఇవేవి కూడా ఈ సినిమాను కాపాడ‌లేక‌పోయాయి. ఫ‌స్ట్ షో నుంచే ఘోర‌మైన డిజాస్ట‌ర్ టాక్ తెచ్చుకుంది. అస‌లు సినిమా ఏ మాత్రం బాగోలేద‌నే అంటున్నారు.

ఫ‌స్ట్ డే ఓపెనింగ్స్ మిన‌హా సినిమా ఫ‌స్ట్ వీకెండ్‌లో కూడా నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మే అంటున్నారు. అయితే విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి ప్ర‌ముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చెప్పింది నిజం అవుతుందా ? అన్న చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. విజ‌య్ జాత‌కంలో అష్ట‌మ‌ద‌శ శ‌ని న‌డుస్తోంద‌ట‌. విజ‌య్ మ‌రో ఉద‌య్ కిర‌ణ్ అయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కూడా వేణుస్వామి వాద‌న‌.

గతంలో అర‌వింద్ స్వామి, అబ్బాస్‌, ఉద‌య్ కిర‌ణ్, కునాల్‌ లాంటి హీరోలు ఒక్క‌సారిగా ఎలా అయితే స్టార్‌డ‌మ్ చూసి చతికిల‌ప‌డ్డారో ? ఇప్పుడు విజ‌య్ కూడా ఖ‌చ్చితంగా అంతే స్టార్‌డ‌మ్ చూసి చ‌తికిల‌ప‌డతాడ‌ని వేణుస్వామి గ‌తంలో చెప్పాడు. విజ‌య్ జాత‌కంలో ఉన్న అష్ట‌మ‌ద‌శ శ‌ని ప్ర‌భావంతో విజ‌య్ విజ‌యాల బాట నుంచి ఒక్క‌సారిగా అప‌జ‌యాల్లోకి వెళ్లిపోతాడ‌ని ఆయ‌న అన్నారు.

అందుకే ఇప్ప‌టికే వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌, డియ‌ర్ కామ్రేడ్ లాంటి రెండు ప్లాపుల‌తో ఉన్న విజ‌య్ ఇప్పుడు లైగ‌ర్‌తో పెద్ద దెబ్బే తిన్నాడు. పైగా ఇది భారీ బ‌డ్జెట్ సినిమా. విజ‌య్‌కు పాన్ ఇండియా ప‌రంగా ఫ‌స్ట్ సినిమా. ఈ సినిమాకు విజ‌య్ కెరీర్లోనే హ‌య్య‌స్ట్ బిజినెస్ జ‌రిగింది. ఇప్పుడు మూడు వ‌రుస ప్లాపులు ప‌డడం అంటే ఖ‌చ్చితంగా విజ‌య్ కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బే అనుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news