Moviesఆ విషయంలో అనన్య కు దండం పెట్టాల్సిందే..ఒక్క దెబ్బతో ట్రెండింగ్ లోకి...

ఆ విషయంలో అనన్య కు దండం పెట్టాల్సిందే..ఒక్క దెబ్బతో ట్రెండింగ్ లోకి స్టార్ డాటర్..!

స్టార్ డాటర్ అనన్యపండే రీసెంట్ గా రిలీజ్ అయిన లైగర్ మూవీ తెలుగులో హీరోయిన్ గా పరిచయమైంది. తన హాట్ అందాలకు తెలుగు జనాలు ఫిదా అయిపోయారు. పర్ఫెక్ట్ ఫిగర్ తో ..హాట్ లుక్స్ తో.. ఎక్సలెంట్ యాక్టింగ్ స్కిల్స్ తో,, మొదటి సినిమాతోనే తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. నిజానికి లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. అనన్య నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. పూరి డైరెక్షన్ సరిగ్గా లేదనే కానీ, సినిమాలో విజయ్ దేవరకొండ పర్ఫామెన్స్ అనన్య నటించిన తీరు జనాలను మెప్పించింది.

అయితే ఈ సినిమా కోసం అనన్య పాండే పడ్డ కష్టాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి ఏ హీరోయిన్ అయినా సరే సినిమాని ఒప్పుకునే రోజే ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేయడానికి సిద్ధపడుతుంది. ఇప్పటివరకు అందరూ హీరోయిన్స్ అలాగే చేసుకోవచ్చారు. కానీ ఏ హీరోయిన్ కూడా అనన్య పాండే పడ్డట్టు సినిమా ప్రమోషన్స్ కోసం తాపత్రయ పడలేదు. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే లైగర్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు అనన్యపండే.. ఏ ప్రమోషన్స్ కు డుమ్మా కొట్టలేదు.

 

” నేను రాను” అని చెప్పలేదు. ప్రతి ప్రమోషన్స్ పనుల్లో ఓపిగ్గా పాల్గొంది. డీసెంట్ గా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. దీంతో “ఈ విషయంలో అనన్య పండే కు దండం పెట్టాల్సిందే. మన తెలుగు హీరోయిన్లు కూడా ఈ రేంజ్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. కానీ పాపం అమ్ముడు సినిమా ఫ్లాప్ అయింది . అదే సినిమా హిట్ అయుంటే.. తెలుగులో వరస అవకాశాలు అందుకొని ఉండేది” అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news