Moviesతమన్నా చివ‌ర‌కు దానికే ప‌నికొచ్చేలా ఉందా... కెరీర్ ఖ‌తం చేసుకుందే...!

తమన్నా చివ‌ర‌కు దానికే ప‌నికొచ్చేలా ఉందా… కెరీర్ ఖ‌తం చేసుకుందే…!

మిల్కీ బ్యూటీ తమన్నాకి లైఫ్ ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది. గుర్తింపు తెచ్చింది మాత్రం శేఖర్ కమ్ముల. అంతకముందే ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించిన తమన్నా హీరోయిన్‌గా పనికిరాదని కామెంట్స్ చేశారు. అలాంటి సమయంలో తమన్నాని శేఖర్ కమ్ముల ఆయన దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమాలో ఓ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో తమన్నా పాత్ర చాలా హైలెట్ ఐంది. అందరికంటే కూడా ఎక్కువగా పాపులర్ అయింది తమన్నానే.

ఈ సినిమా తర్వాత తమన్నా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. దీనికి మరో దర్శకుడు కూడా మరో కారణం. ఆ దర్శకుడే సంపత్ నంది. రెండవ సినిమా మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్ హీరోగా రూపొందించాడు. అదే రచ్చ. ఈ సినిమాలో తమన్నా తళుకులు, మిల్కీ అందాలు ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. ఆ సినిమా నుంచి తమన్నాకి హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా భారీ చిత్రాలలో అవకాశాలు అందుకుంది.

తమన్నాని చాలా ప్లస్‌లున్నాయి. ఒకటి తన అందం రెండవది డాన్స్. ఎలాంటి హీరో పక్కన నటించిన హిట్ దక్కించుకుంది. ఆ హీరోకు తగ్గట్టుగా డాన్స్ చేసి ఆకట్టుకుంది. అయితే, తమన్నాకి ఈ మధ్య కాస్త అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫాంస్ బాగా ఊపందుకున్నాయి. ఇక్కడ వెబ్ సిరీస్‌లు విరివిగా రూపొందుతున్నాయి. సినిమాలలో ఉన్న కండీషన్స్ ఇక్కడ లేవు. అందుకే, ఎలాంటి నటీనటులైన తమ సత్తా చాటుకుంటున్నారు. మంచి పాత్రలను చేస్తూ బాగా సంపాదిస్తున్నారు.

అయితే, ఇక్కడ సెటిలవనివారూ ఉన్నారు. వారిలో తమన్నా కూడా ఉంది. తమన్నా హీరోయిన్‌గా స్టార్ స్టేటస్ తెచ్చుకుంది గానీ, హోస్ట్‌గా చేసిన కుకరీ షో అట్టర్ ఫ్లాప్‌గా మిగిలింది. అలాగే వెబ్ సిరీస్‌లు కూడా తమన్నాను ముంచాయే తప్ప క్రేజ్ తెచ్చిపెట్టింది లేదు. దాంతో తమన్నా వెబ్ సిరీస్‌కి, రియాలిటీ షోస్‌కి పనికిరాదని తేలిపోయింది. అంటే తమన్నా ఆ ఒక్కదానికే తప్ప, మిగిలిన రెండు పాపులర్ ప్లాట్ ఫాంస్ కి సెట్ అవదని తేల్చేశారు. ప్రస్తుతం తమన్నా చేతిలో ఒక్క మెగాస్టార్ సినిమా మాత్రమే ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news