Moviesఆలీ కి కాబోయే అల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలుసా..హీరోలకి మించిపోయే స్టేటస్..!?

ఆలీ కి కాబోయే అల్లుడు బ్యాక్ గ్రౌండ్ తెలుసా..హీరోలకి మించిపోయే స్టేటస్..!?

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుసగా అందరు పెళ్లి పీఠలు ఎక్కేస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్ ల దగ్గర నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టులు పలువురు బుల్లితెర నటులు కూడా తామ ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీ లో సందడి వాతావరణం నెలకొంది. ఒక సెలబ్రిటీకి సంబంధించిన పెళ్లి పనులు పూర్తవుగానే మరో సెలబ్రిటీకి సంబంధించిన పెళ్లి పనులు స్టార్ట్ అవుతున్నాయి, దీంతో స్టార్స్ అందరూ ఒక్కచోట చేరి సందడి చేస్తున్నారు.

రీసెంట్ గా కమెడియన్ అలీ కూతురు ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగింది. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో కామెడీ చేస్తూ కడుపుబ్బ నవ్వించే ఆలీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరు ఆయన కామెడీ టైమింగ్ ని.. ఆలీ కామెడీ పంచలకి ఫిదా అవుతారు. ఆలీ ఎక్కడుంటే అక్కడ నవ్వుల వర్షమే అలా ఉంటుంది ఆలీ తో కామెడీ. కాగా ఆలీ కూతురు నిశ్చితార్థం సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో వచ్చాయి. మనకు తెలిసిందే ఆలీ భార్య పేరు జుబేదా . అలీ జుబేదా దంపతులకు ముగ్గురు సంతానం . కాగా పెద్ద కూతురు ఫాతిమా ఇటీవలే తన చదువును కంప్లీట్ చేసింది .

ఇప్పుడు నిశ్చితార్థం జరిగింది కూడా ఆమెకే. రీసెంట్ గా అలీ కూతురు ఫాతిమా ఎంగేజ్మెంట్ సంబంధించిన వీడియోను జుబేదా తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ నిషితార్థపు వేడుకకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు స్టార్స్ తో పాటు బుల్లితెర నటులు కూడా రావడం కలర్ ఫుల్ గా ఉంది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు కమెడియన్ బ్రహ్మానందం. ఆయన వధూవరులను తన దైన స్టైల్ లో ఆశీర్వదిస్తూ సరదాగా ఆటపట్టించాడు.


కాగా నవవధువు ఫాతిమా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతుంది. ఆలీ భార్య జుబేదా లంగా వోణీనో కూతురుకి మ్యాచింగ్ వేసుకుంటూ చాలా స్టైలిష్ గా కనిపించింది. ఇక కళ్యాణమండపం మొత్తం ఆలీ జుబేదా ఎంగేజ్మెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించి తమ ఆతిథ్యాన్ని ఇచ్చారు. కాగా అలికి కాబోయే అల్లుడు డీటెయిల్స్ చాలా గోప్యంగా ఉంచాడు కమెడియన్ ఆలీ.

కానీ కమెడియన్ ఆలీ అల్లుడు గురించి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. ఈయన బాగా డబ్బున్న వ్యక్తిగా తెలుస్తుంది. అంతేకాదు అలీ కాబోయే అల్లుడికి ప్రజాసేవ అంటే చాలా ఇష్టమట. తాను సంపాదించిన దానితో ఆయన ఎక్కువ పేదవారికి సహాయం చేస్తుంటారట. అంతేకాదు చాలా సాఫ్ట్ క్యారెక్టర్ అని చాలా సైలెంట్ అని.. తన పని తాను చూసుకో పోయే టైప్ అని తెలుస్తుంది . ఈ విషయంలో ఆలీ చాలా అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news