Moviesహీరోయిన్ అంజలిని ఆ బడా హీరో కొడుకు నమ్మించి మోసం చేశాడా...?...

హీరోయిన్ అంజలిని ఆ బడా హీరో కొడుకు నమ్మించి మోసం చేశాడా…? ఎవరా హీరో..?

టాలీవుడ్ లో అతికొద్ది తెలుగ‌మ్మాయిలు మాత్ర‌మే హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి స‌క్సెస్ అయ్యారు. ఆ లిస్ట్ లో అంజ‌లి కూడా ఉంటారు. ఫోటో సినిమాతో అంజ‌లి త‌న సినీ ప్ర‌స్థానాన్ని మొద‌లు పెట్టింది. కానీ జ‌ర్నీ సినిమాతో హీరోయిన్ గా సూప‌ర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అంజ‌లి త‌న న‌ట‌న‌తో మైమ‌రిపించింది. జ‌ర్నీ సినిమాలో అంజ‌లి న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు అలా క‌నెక్ట్ అయిపోయారు. నిజంగా బ‌య‌ట మాస్ అమ్మాయిల ఆటిట్యూడ్ ఎలా ఉంటుందో ఆ పాత్రలో లీన‌మై చూపించింది. ఈ సినిమా త‌ర‌వాత వ‌రుస‌గా త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల్లో ఆఫ‌ర్ల‌ను అందుకుంది.

అలా కేవ‌లం తెలుగులోనే కాకుండా ఇత‌ర ఇండస్ట్రీల‌లో అభిమానుల‌ను సంపాదించుకుంది. టాలీవుడ్ లో డిక్టేట‌ర్, సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లో చెట్టు, గీతాంజ‌లి లాంటి సినిమాల్లో హీరోయిన్ గా న‌టించింది. త‌క్కువ టైంలోనే ఆమెకు బాల‌య్య‌, వెంక‌టేష్ సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు ఐట‌మ్ సాంగ్స్ లోనూ స్టెప్పులు వేస్తోంది. ప్ర‌స్తుతం నితిన్ హీరోగా న‌టించిన మాచ‌ర్ల నియోక‌వ‌ర్గం సినిమాలోనూ ఐట‌మ్ సాంగ్ లో స్టెప్పులు వేయగా ఆ పాట‌కు సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.

మ‌రోవైపు రామ్ చ‌ర‌ణ్ శంక‌ర్ కాంబినేష‌న్ లో వ‌స్తున్న పాన్ ఇండియా సినిమాలో కూడా అంజ‌లి ముఖ్య పాత్ర‌లో న‌టించే అవ‌కాశం ద‌క్కించుకుంది. ఇదిలా ఉండ‌గా అంజ‌లిని ఓ స్టార్ హీరో కుమారుడు నమ్మంచి మోసం చేశాడ‌నే వార్త నెట్టింట చక్క‌ర్లు కొడుతోంది. కెరీర్ లో ఒడిదొడుకులు ఎదురుకుంటున్న స‌మ‌యంలో అంజ‌లి లైఫ్‌లోకి ఆ స్టార్ హీరో కుమారుడు ఎంట్రీ ఇచ్చాడ‌ట‌. ఆ త‌ర‌వాత ఇద్ద‌రూ క‌లిసి కొంత‌కాలం జాలీగా తిరిగార‌ట‌. అయితే ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ద‌లు వ‌చ్చి విడిపోయారట‌.

అంత‌కు ముందే ఆమె కోలీవుడ్ హీరో జైతో క‌లిసి చాలా రోజుల పాటు డేటింగ్ చేసింది. ఇద్ద‌రూ క‌లిసే ఎంతో ప్రేమ‌తో ఉండేవారు. వీరు పెళ్లి చేసుకుంటార‌న్న ప్ర‌చారం కూడా గ‌ట్టిగా జ‌రిగింది. త‌ర్వాత బ్రేక‌ప్ చెప్పేసుకున్నారు. జైకు దూరం జ‌రిగేకే అంజ‌లి ఆ స్టార్ హీరో కొడుక్కి ద‌గ్గ‌రైంద‌న్న ప్ర‌చారం అయితే గ‌ట్టిగానే జ‌రిగింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news