Moviesవిజయ్ దేవరకొండ లైగర్ ను రిజెక్ట్ చేసిన ఆ బిగ్ స్టార్...

విజయ్ దేవరకొండ లైగర్ ను రిజెక్ట్ చేసిన ఆ బిగ్ స్టార్ హీరోలు వీళ్ళే ..!!

ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మొత్తం ఆశ గా ఎదురు చూస్తుంది లైగర్ సినిమా కోసమే. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరో గా తెరకెక్కుతున్న ఫస్ట్ సినిమా ఇదే. రెండోది..పూరీ జగన్నాధ్ కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా కావడం. దాదాపు రెండేళ్లు కు పైగా కష్టపడి సినిమాని తెరకెక్కించారు మేకర్స్. ఈ సినిమా హాట్ బ్యూటీ బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది.

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునేలా చేసింది. అయితే, ట్రైలర్ ఆధారంగా ఈ సినిమా మొత్తం..పూరీ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీ గా తెరకెక్కిన అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి..లా ఉందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. కొన్ని సీన సేమ్ డిట్టో దించేశాడు..పూరి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు జనాలు. అయితే, ఈ సినిమా కధను ముందుగా ముగ్గురు స్టార్ హీరోలకు చెప్పాడట పూరీ జగన్నాధ్. వాళ్ళు ముగ్గురు ఒక్కే రీజన్ తో ఈ సినిమా రిజెక్ట్ చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ మూవీకి ఊహించని స్థాయిలో ప్రమోషన్స్ జరుగుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ మార్కెట్ కు మించి ఈ సినిమాకు డబ్బులు ఖర్చు చేశారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే, ఈ సినిమా కధను ఫస్ట్ పూరీ వినిపించింది..అల్లు అర్జున్ కి అంట. ఆ బాడీ లాంగ్వేజ్ కి ఈ కధ బాగా సూట్ అవుతుందని చెప్పితే..బన్నీ పుష్ప షూటింగ్ లో బిజీ గా ఉండి వదులుకున్నాడట.

అలాగే ఈ కధను తరువాత తారక్ కి చెప్పితే..జక్కన్న తో సినిమా కి కమిట్ అయ్యి వదులుకున్నాడట. లాస్ట్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ను అడిగితే..స్టోరీ ఒకే బట్ కాల్ షీట్లు ఖాళీ లేవు..ఓ రెండేళ్లు ఆగి తీద్దాం అంటూ హోల్డ్ లో పెట్టారట. లాస్ట్ కి ఈ కధ రౌడీ హీరో కి చెప్పితే..వెంటనే షూటింగ్ మొదలు పెడతాం అన్ని చెప్పి పూరీకి బూస్టప్ ఇచ్చారట. అలా ఈ సినిమా ముగ్గురు హీరోలు చేతులు మారి..లాస్ట్ కి విజయ్ చేతికి వెళ్ళింది. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో..?

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news