Moviesనిత్య మీనన్ పెళ్లి కుదిరిపోయిందోచ్..వరుడు మనకు బాగా తెలిసినవాడే..?

నిత్య మీనన్ పెళ్లి కుదిరిపోయిందోచ్..వరుడు మనకు బాగా తెలిసినవాడే..?

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో అందరు హీరో, హీరోయిన్లు పెళ్లి చేసుకుని..ఓ ఇంటి వారు అయిపోతున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మలు కత్రినా, అలియా భట్..కోలీవుడ్ హీరో ఆది పినిశెట్టి..ఇలా అందరు తాము ప్రేమించిన వారితో జీవితం పంచుకోవడానికి ఓ కొత్త స్టెప్ తీసుకుని..పెళ్ళి చేసుకుని..భార్య భర్తలుగా మారిపోయారు. ఇందులో అలియా అయితే, ఏకంగా రెండు నెలలకే తల్లి అయిపోయింది. దాని వెనుక అసలు కధ చాలా ఉన్నా..ఇప్పుడు ఇండస్ట్రీలో మరో హీరోయిన్ నిత్యా మీనన్ కూడా పెళ్ళి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

యస్..మలయాళ బ్యూటీ..అందాల ముద్దుగుమ్మ..నేచురల్ యాక్టింగ్ చేస్తూ..స్టార్ హీరోలను సైతం తన అభిమానులు గా మార్చుకున్న నిత్యా మీనన్..ఇప్పుడు పెళ్ళి చేసుకోబోతుంది అంటూ ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. నిజానికి సినీ ఇందస్ట్రీలో ఉండే హీరోయిన్లు గురించి ఏదో ఒక న్యూస్ ..గాసిప్ గా మారి..వాళ్లతో ఎఫై..వీళ్లతో ఎఫైర్ అంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. కానీ, ఇప్పటి వరకు నిత్య మీనన్ పై ఒక్క న్యూస్ కూడా అలా చెడుగా రాలేదు.

 

కానీ, ఇలా సడెన్ ఆమె పెళ్ళి వార్త నెట్టింట ప్రత్యేక్ష మవ్వడం ..అభిమానులకు షాకింగ్ గా ఉంది. అంతేకాదు, ఆమె పెళ్ళి చేసుకోబోయేది మలయాళ స్టార్ హీరోనే అని కూడా తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీలోకి రాక ముందు నుండి కూడా తన తో ఫ్రెండ్ షిప్ ఉండేదట. ఇక ఆ పరిచయ,..అలా అలా స్నేహంగా..ఆ తరువాత ప్రేమగా మారిన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మన తెలుగు వాళ్ళకి కూడా బాగా పరిచయమైన వాడే అంటూ ఓ క్రేజీ రూమర్ వైరల్ గా మారింది. మరి చూడాలి, నిత్య తన పెళ్ళి పై అఫిషీయల్ ప్రకటన ఎప్పుడు చేస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news