Moviesఆ స్టార్ హీరో నన్ను ఆ విధంగా పిలవడం అస్సలు ఇష్టం...

ఆ స్టార్ హీరో నన్ను ఆ విధంగా పిలవడం అస్సలు ఇష్టం లేదు..రష్మిక సంచలన కామెంట్స్..!!

రష్మిక మందన్న ..ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే అందరిని తన వైపు తిప్పేసుకుంది. ఒకటి కాదు రెండు వరుసగా సినిమాలకు కమిట్ అవుతూ..ప్రస్తుతం చేతిలో ఐదు బడా ప్రాజెక్ట్స్ ని చేతిలో పెట్టుకుని ఉంది. అంతేనా..సినిమా సినిమాకి రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ..అందానికి నటనకు స్టార్ హీరోలు కూడా మెల్ట్ అవుతున్నారు .

కాగా, టాలీవుడ్ తో పాతు కోలీవుడ్, బాలీవుడ్ లోకూడా మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ.. ప్రజెంట్ బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ సందీప్ వంగా తెరకెక్కిస్తున్న సినిమా యానిమల్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ ఇటీవల మనాలీలో తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ నేషనల్‌ మీడియాతో ముచ్చటించిన రష్మిక యానిమల్‌ మూవీ విశేషాలను పంచుకుంది. ఈ క్రమంలో ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఆమె మాట్లాడుతూ..” రణ్‌బీర్‌ నేను కలవడం ఇదే మొదటిసారి. నాకు ఆయన యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమాలో ఆయంతో కలిసి వర్క్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సందీ గారి లాంటి బడా డైరెక్టర్ దర్శకతవంలో సినిమా చేయడం నిజంగా నా లక్.

అయితే, ఈ సినిమా స్టార్టింగ్ టైంలో రణ్‌బీర్‌ ను చూసి నెర్వస్ అయ్యేదాని..ఆయన నాకు ఆ ఆతరువాత మంచి కంఫర్టబుల్ ఇచ్చారు. కానీ..ఆయన నన్ను మేడమ్ అని పిలుస్తారు అది నాకు ఇష్టం లేదు. కానీ, హీరోలల్లో అలా నన్ను మేడమ్ అని పిలిచిన మొదటి వ్యక్తి ఆయనే..” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో అమ్మడు రణ్‌బీర్‌ ని పరోక్షంగా పొగుడుతూ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news